విజయ్‌ ఇంటికి బాంబు బెదిరింపు

6 Jul, 2020 09:12 IST|Sakshi
విజయ్‌, విజయ్‌ ఇల్లు

సినిమా: ప్రముఖ నటుడు విజయ్‌ ఇంటికి బాంబు బెదిరింపు ఫోన్‌ కాల్‌ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఆయన ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. ప్రముఖ నటుల ఇళ్లకు బాంబు బెదిరింపు రావడం ఇటీవల పరిపాటిగా మారింది. ఈమధ్య రజినీకాంత్‌ ఇంట్లో బాంబు పెట్టినట్టు ఒక అజ్ఞాత వ్యక్తి పోలీసులకు ఫోన్‌ చేసి చెప్పాడు. దీంతో పోలీసులు వెంటనే స్థానిక పోయస్‌ గార్డెన్‌ లోని రజినీకాంత్‌  ఇంటికి చేరుకుని సోదాలు నిర్వహించారు. అయితే అక్కడ ఎలాంటి బాంబు లేకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా శనివారం రాత్రి 12:30 ప్రాంతంలో  స్థానిక  సాలిగ్రామంలోని విజయ్‌ ఇంట్లో బాంబు పెట్టినట్లు పోలీసులకు ఫోన్‌ వచ్చింది. (కరోనా: హీరో విజయ్‌ ఇంటిలో ఆరోగ్యశాఖ తనిఖీ )

దీంతో పోలీసులు బాంబు స్క్వాడ్‌  శునకాలతో  విజయ్‌ ఇంటికి వెళ్లి శోధించారు. ఆ ఇంటి పరిసర ప్రాంతాలు క్షుణం గా తనిఖీలు చేశారు. అయితే అక్కడ బాంబు కనిపించకపోవడంతో ఇది కూడా బాంబు బూచి ఫోన్‌ కాల్‌ అనే నిర్ధారణకు వచ్చారు. కాగా ఈ వ్యవహారంపై పై పోలీసులు విచారణలో స్థానిక విల్లుపురంకు చెందిన ఒక మానసిక రోగి ఈ బాంబు బెదిరింపు ఫోన్‌ చేసినట్టు తెలిసింది. కాగా నటుడు విజయ్‌ ప్రస్తుతం స్థానిక నీలాంకరై సమీపంలోని ఇంటిలో కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్నారు. లోకేష్‌ కనక రాజ్‌ దర్శకత్వంలో మాస్టర్‌ చిత్రాన్ని పూర్తి చేసిన విజయ్‌ తాజాగా ఏ ఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా