This Week OTT Releases: ఈ వారం ఓటీటీల్లో 25 సినిమాలు రిలీజ్!

20 Dec, 2023 19:52 IST|Sakshi

ఈ వారం ఓటీటీ సినిమాల కంటే ప్రభాస్ సలార్‌ చిత్రంపైనే అందరి దృష్టి ఉందనడంలో సందేహం లేదు. మరోవైపు సలార్‌తో పోటీ పడేందుకు షారుక్ ఖాన్ డంకీ సైతం ఈ నెల 21న థియేటర్లలోకి రానుంది. బాక్సాఫీస్ బరిలో రెండు పెద్ద హీరోల చిత్రాలో కావడంతో ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఈ వారంలో ఓటీటీల్లోనూ సందడి చేసేందుకు చిత్రాలు రెడీ అయిపోయాయి. 

ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు ఈ వీకెండ్‌లో ఏకంగా 25 సినిమాలు వచ్చేస్తున్నాయి. ఈ వారంలో టాలీవుడ్ హీరో వైష్ణవ్ తేజ్, శ్రీలీల నటించిన 'ఆదికేశవ', రక్షిత్ శెట్టి, రుక్మిణి నటించిన 'సప్త సాగరాలు దాటి సైడ్-బి' అలరించనున్నాయి. ఈ సినిమాలతో పాటు వెబ్‌సిరీస్‌లు, బాలీవుడ్‌ చిత్రాలు సందడి చేసేందుకు వస్తుండగా.. ఇప్పటికే కొన్ని మూవీస్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఏయే సినిమాలు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో ఓ లుక్కేయండి. 

ఈ వారం ఓటీటీలో అలరించే చిత్రాలు

నెట్‌ఫ్లిక్స్
    సిండీ లా రెజీనా: ద హై స్కూల్ ఇయర్స్ (స్పానిష్ సిరీస్) - డిసెంబరు 20
    మ్యాస్ట్రో (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 20
    ద టేమింగ్ ఆఫ్ ష్రూడ్ 2 (పోలిష్ సినిమా) - డిసెంబరు 20
    అల్హమర్ H.A (అరబిక్ మూవీ) - డిసెంబరు 21
    లైక్ ఫ్లవర్స్ ఇన్ సాండ్ (కొరియన్ సిరీస్) - డిసెంబరు 21
    రెబల్ మూన్ పార్ట్ 1: ఏ చైల్డ్ ఆఫ్ ఫైర్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబరు 21
    ఆదికేశవ (తెలుగు మూవీ) - డిసెంబరు 22
    కర్రీ & సైనైడ్: ద జాలీ జోసెఫ్ కేస్ (హిందీ సిరీస్) - డిసెంబరు 22
    యోంగ్‌సాంగ్ క్రియేచర్ (కొరియన్ సిరీస్) - డిసెంబరు 22
    కుయికో (తమిళ మూవీ) - డిసెంబరు 22
    ఏ వ్యాంపైర్ ఇన్ ద ఫ్యామిలీ (పోర్చుగీస్ సినిమా) - డిసెంబరు 24
    పింక్ ఫాంగ్ సింగ్-అలాంగ్ మూవీ 3: క్యాచ్ ద జింజర్ బ్రెడ్ మ్యాన్ (ఇంగ్లీష్ చిత్రం) - డిసెంబరు 24

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

    BTS మాన్యుమెంట్స్: బియాండ్ ద స్టార్ (కొరియన్ సిరీస్) - డిసెంబరు 20
    డ్రాగన్స్ ఆఫ్ వాండర్ హ్యాచ్ (జపనీస్ సిరీస్) - డిసెంబరు 20
    పెర్సీ జాక్సన్ అండ్ ఒలింపియన్స్ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 20
    వాట్ ఇఫ్..?: సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 22

అమెజాన్ ప్రైమ్ వీడియో

    ద ఏసెస్ (ఇండోనేసియన్ మూవీ) - డిసెంబరు 21
    డ్రై డే (హిందీ సినిమా) - డిసెంబరు 22
    సాల్ట్ బర్న్ (ఇంగ్లీష్ చిత్రం) - డిసెంబరు 22
    సప్త సాగరాలు దాటి సైడ్-బి (తెలుగు డబ్బింగ్ మూవీ) - డిసెంబరు 22

జీ5

    అడి (మలయాళ మూవీ) - డిసెంబరు 22
    హోమోరస్లీ యూవర్స్: సీజన్ 3 (హిందీ సిరీస్) - డిసెంబరు 22

జియో సినిమా

    బార్బీ (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబరు 21
    హే కమీని (హిందీ మూవీ) - డిసెంబరు 22

లయన్స్ గేట్ ప్లే

    ఫియర్ ద నైట్ (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబరు 22


 

>
మరిన్ని వార్తలు