అడవి సాక్షిగా..

24 Feb, 2019 01:28 IST|Sakshi

అదొక అటవీ ప్రాంతం. అడవి సాక్షిగా ఆ ప్రాంతంలో ఉండే రెండు మనసులు కలుస్తాయి. అయితే వారి ప్రేమకు ఆ అమ్మాయి అన్నలు విలన్లు అవుతారు. మరి.. ఆ జంట తమ ప్రేమను ఎలా గెలిపించుకున్నారు? అనే కథాంశంతో రూపొందిన ఓ తమిళ చిత్రం ‘గజేంద్రుడు’ పేరుతో తెలుగులో విడుదల కానుంది. ఆర్య, కేథరిన్‌ జంటగా రాఘవ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని లక్షీ్మ వెంకటేశ్వర  ఫ్రేమ్స్‌ పతాకంపై  భారతి, వరప్రసాద్‌ వడ్డెల్ల  సమర్పణలో ఉదయ్‌ హర్ష వడ్డెల్ల తెలుగులోకి అనువదిస్తున్నారు.

ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఉదయ్‌ హర్ష వడ్డెల్ల  మాట్లాడుతూ – ‘‘హీరోగా,  విలన్‌గా ఆర్య తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే. కథానాయికగా కేథరిన్‌ చాలా పాపులర్‌. వీరిద్దరి జంట తెరపై కనువిందు చేసే విధంగా ఉంటుంది. తమిళంలో ఘన విజయం సాధించి, క్రిటిక్స్‌ నుంచి మంచి ప్రశంసలు అందుకున్న చిత్రమిది. ఇందులో ఓ కొండ ప్రాంతాల్లో ఉండే గిరిజన పుత్రులుగా ఇద్దరూ నటించారు. సినిమా అంతా కూడా కొండ ప్రాంతంలో ఉంటూ ఆద్యంతం థ్రిల్‌కి గురి చేసేలా ఉంటుంది. ఆర్య ఈ సినిమా కోసం వెయిట్‌ పెరిగారు. సినిమాకు ఓ హైలెట్‌ గా యువన్‌ శంకర్‌ రాజా మ్యూజిక్‌ ఉంటుంది. మార్చిలో రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం’’ అన్నారు. 

మరిన్ని వార్తలు