ఈ హీరోయిన్ 'లిమిటెడ్ ఎడిషన'ట..!

20 Jun, 2017 16:32 IST|Sakshi

హీరోయిన్ చార్మీ ఇప్పుడు వెండితెర మీద కనిపించటం తగ్గించేసినా.. సోషల్ మీడియాలో మాత్రం తెగ హడావిడి చేసేస్తోంది. దర్శకుడు పూరి జగన్నాథ్ ఏర్పాటు చేసిన పూరి కనెక్ట్ బాధ్యతలు చూస్తున్న ఈ బ్యూటి, పూరి సినిమా షూటింగ్ లలోనూ హడావిడి చేస్తోంది. ప్రస్తుతం పూరి జగన్నాథ్, బాలకృష్ణల కాంబినేషన్ లోరూపొందుతున్ పైసా వసూల్ షూటింగ్ పోర్చుగల్లో జరుగుతోంది.

ప్రస్తుతం పూరీ టీంతో కలిసి పోర్చుగల్ లో ఉన్న చార్మీ తన చేతిమీద టాటూ వేయించుకుంటున్న ఫోటోలను ట్విట్టర్లో పోస్ట్ చేసింది. చేతి మీద లిమిటెడ్ ఎడిషన్ అనే డిజైన్తో పాటు.. కాలు మీద స్పానిష్ భాషలో కొటేషన్ను టాటూ వేయించుకుంది. టాటూ ఆర్టిస్ట్ తో పాటు చార్మీ దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.