ప్రేమలో చిక్కులు

17 Feb, 2018 01:57 IST|Sakshi
ఆనంది, జీవీ ప్రకాష్‌కుమార్‌

జీవీ ప్రకాష్‌కుమార్‌ హీరోగా, నిక్కీ గల్రానీ, రక్షిత హీరోయిన్లుగా ఎం.రాజేష్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఓ తమిళ చిత్రాన్ని ‘చెన్నై చిన్నోడు’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. ‘వీడి లవ్‌లో అన్నీ చిక్కులే’ అన్నది ఉపశీర్షిక. శూలిని దుర్గా ప్రొడక్షన్స్‌ పతాకంపై వి.జయంత్‌కుమార్‌ తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. జీవీ ప్రకాష్‌కుమార్‌ స్వరపరచిన ఈ చిత్రం పాటలను తెలంగాణ ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ చైర్మన్‌ ప్రతాని రామకృష్ణగౌడ్‌ ఆవిష్కరించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘చిన్నతనంలోనే నిర్మాతగా మారిన జయంత్‌ కుమార్‌ని అభినందిస్తూ, తనకు నిర్మాతగా మంచి భవిష్యత్‌ ఉండాలని కోరుకుంటున్నా’’ అన్నారు. నిర్మాత వి.జయంత్‌ కుమార్‌ మాట్లాడుతూ– ‘‘మా తాతగారి దగ్గర నుంచి మాకు సినిమా రంగంతో మంచి అనుబంధం ఉంది. ఆద్యంతం కడుపుబ్బా నవ్వించే చక్కని కామెడీ ఎంటర్‌టైనర్‌ ఇది.  హీరో జీవాగారు గెస్ట్‌ రోల్‌లో కనిపిస్తారు. త్వరలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు.

మరిన్ని వార్తలు