చిన్న సినిమాలంటే చిన్న చూపు – డి.సురేశ్‌బాబు

12 Sep, 2018 00:26 IST|Sakshi

‘‘చిన్న సినిమాలంటే చిన్న చూపు ఉండే చెడు అలవాటుకు మనం అలవాటు పడిపోయి ఉన్నాం. మంచి సినిమాలను తక్కువ మంది చూస్తున్నారు. అందుకే ‘కేరాఫ్‌ కంచరపాలెం’ చిత్రాన్ని ఫిలిం లవర్స్‌కు, సెలబ్రిటీస్‌కి చూపించాం. అందరూ సినిమా చూసి, చాలా బావుందని జనాల్లోకి తీసుకెళ్లారు. ఇందుకు ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్‌’’ అని నిర్మాత డి. సురేశ్‌బాబు అన్నారు. సుబ్బారావు, రాధా బెస్సి, కేశవ, కార్తీక్‌ తదితరులు ప్రధాన తారాగణంగా వెంకట్‌ మహా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కేరాఫ్‌ కంచరపాలెం’. రానా దగ్గుబాటి సమర్పణలో విజయ్‌ ప్రవీణ పరుచూరి నిర్మించి, నటించిన ఈ సినిమా ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్‌ నిర్వహించారు. డి. సురేశ్‌బాబు మాట్లాడుతూ– ‘‘విజయ ప్రవీణ అమెరికా నుంచి వచ్చి వెంకటేశ్‌ మహా అనే కొత్త అబ్బాయితో ధైర్యంగా సినిమా నిర్మించింది. మహా కొత్త డైరెక్టర్‌ అయినా ప్రతి క్యారెక్టర్‌ను చక్కగా రాసి, నేచురల్‌గా తెరకెక్కించారు.

అందుకే సినిమా చూసినవారందరూ అభినందించారు. ఈ సినిమా ఇంకా సక్సెస్‌ కావాలి. ఇది ఎంత మంచి సినిమానో ఇంకా చాలా మందికి తెలియాలి’’ అన్నారు. ‘‘సినిమాలు చేయాలనే ఆసక్తితో అమెరికా నుంచి ఇండియా వచ్చాను. వెంకట్‌ మహా చెప్పిన కథ నచ్చడంతో సినిమా చేశాం. సురేశ్‌బాబుగారు, రానాగారి సపోర్ట్‌తో సినిమాకు మంచి పేరు వచ్చింది’’ అన్నారు విజయ ప్రవీణ పరుచూరి. ‘‘యాక్టింగ్‌ అనేది డెడ్లీ స్పోర్ట్‌. చాలా ఎనర్జీ ఖర్చు అవుతుంది. నేను కనీస సదుపాయాలు కూడా ఏర్పాటు చేయలేదు. షూటింగ్‌ మధ్య దాహం వేసినా ఇంటికి వెళ్లి నీళ్లు తాగి వచ్చేవాళ్లు. నటీనటులు చాలా కష్టపడ్డారు. సాంకేతిక నిపుణులు ఎంతో సపోర్ట్‌ అందించారు. మా సినిమా ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్‌’’ అన్నారు వెంకటేశ్‌ మహా. నటులు మోహన్‌భగత్, కార్తీక్, మ్యూజిక్‌ డైరెక్టర్‌ స్వీకర్‌ అగస్తీ, సినిమాటోగ్రాఫర్‌ ఆదిత్య, సౌండ్‌ డిజైనర్‌ నాగార్జున, వెంకట్‌ సిద్దారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌లు కలిసి ఏం చేస్తున్నారో చూశారా?

ఒక్క క్లిక్‌తో.. ఈరోజు వార్తా విశేషాలు

బుల్లితెరకు విశాల్‌!

‘ఈ ఇడియట్‌ని ఫాలో అవ్వకండి’

‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి’ లోగో లాంచ్

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌లు కలిసి ఏం చేస్తున్నారో చూశారా?

‘ఆర్‌ఎక్స్ 100’ కార్తికేయ హీరోగా ‘హిప్పీ’

బుల్లితెరకు విశాల్‌!

చరణ్‌కు చిరు సర్‌ప్రైజ్‌

‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి’ లోగో లాంచ్

‘నవాబ్‌’ కూడా నిజజీవిత పాత్రల నేపథ్యమే..!