డాబర్కు ప్రియాంక, సోనాక్షి ప్రచారం

9 Sep, 2014 15:47 IST|Sakshi
డాబర్కు ప్రియాంక, సోనాక్షి ప్రచారం

డాబర్ ఆమ్లా హెయిర్ ఆయిల్ ప్రచారకర్తల జాబితాలో ఇప్పుడో కొత్త తార చేరింది. ఇప్పటికే ఈ హెయిర్ ఆయిల్కు ప్రియాంకా చోప్రా ప్రచారం చేస్తుండగా.. ఆమెతో పాటు సోనాక్షి సిన్హాను కూడా కో-బ్రాండ్ అంబాసిడర్గా నియమిస్తూ డాబర్ సంస్థ నిర్ణయం తీసుకుంది. బాలీవుడ్లో ఒకే సమయంలో అగ్రస్థానంలో ఉన్న ఇద్దరు హీరోయిన్లు ఒకే ఉత్పత్తికి ప్రచారం చేయడం ఇదే మొట్టమొదటిసారి. అందులోనూ డాబర్ ఆమ్లా హెయిర్ ఆయిల్ విషయంలో ఇలా జరగడం అయితే దేశ చరిత్రలోనే ఇది మొదటిసారి అవుతుంది.

ఈనాటి మహిళల అవసరాలు తీర్చడానికి డాబర్ ఆమ్లా హెయిర్ ఆయిల్ ఒక ఫేస్ లిఫ్ట్ తయారుచేసిందని, దాంతో తమ బ్రాండు మరింత యూత్ఫుల్గా తయారవుతుందని వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల విభాగం ఆమర్కెటింగ్ హెడ్ ప్రవీణ్ జైపూరియర్ తెలిపారు. ఈ కొత్త గుర్తింపుతో తమ బ్రాండు ఈరోజు జీవనశైలికి అనుగుణంగా ఉంటుందని ఆయన చెప్పారు. ఈ ఇద్దరు తారలతో కూడిన ప్రచార వీడియో త్వరలోనే విడుదల అవుతుందన్నారు.