డబ్బే జీవితం కాదు

26 Oct, 2018 00:43 IST|Sakshi
తనీష్,సుమన్‌

‘‘కథకి నగేష్‌ ఇచ్చే ప్రాధాన్యం గురించి అందరూ చెప్పారు. ‘దేశ దిమ్మరి’ సినిమా తీసేందుకు ముందుకు వచ్చిన నిర్మాతకు అభినందనలు. ప్రస్తుతం చిన్న సినిమాల హవా నడుస్తోంది. ఈ సినిమా హిట్‌ అయి, విజయ పరంపర కొనసాగాలి’’ అని నిర్మాత రాజ్‌ కందుకూరి అన్నారు. తనీష్, షరీన్‌ జంటగా నగేష్‌ నారదాసి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దేశ దిమ్మరి’. స్వతంత్ర గోయల్‌ (శావి యుఎస్‌ఎ) నిర్మించారు. ఈ చిత్రంలో తనీష్‌ పాడిన ‘హే పైసా..’ సాంగ్‌ని విడుదల చేశారు. డైరెక్టర్‌ నగేష్‌ మాట్లాడుతూ– ‘‘పంజాబ్, హర్యానాలో ఈ చిత్రం షూటింగ్‌ చేశాం. కొండలు ఎక్కడం, దిగడం చాలా కష్టం.

నేను ఈ సినిమా కోసం అందర్నీ చాలా ఇబ్బంది పెట్టాను. ముఖ్యంగా తనీష్‌ని, కెమెరామెన్స్‌ని’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో నేను చాలెంజింగ్‌ రోల్‌ చేశా’’ అన్నారు సుమన్‌. ‘‘ఈ చిత్రానికి ప్రేక్షకుల ఆశీస్సులు కావాలి’’ అని గోయల్‌ అన్నారు . ‘‘పనీపాటా లేకుండా దేశం మొత్తం తిరుగుతుండే ఓ కుర్రాడి చుట్టూ తిరిగే సినిమా ఇది. డబ్బు అనేది కేవలం అవసరం.. అదే జీవితం కాదనే కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది’’ అన్నారు తనీష్‌. సంగీత దర్శకుడు సుభాష్‌ ఆనంద్, పాటల రచయిత పార్వతి చంద్, ఫైట్‌మాస్టర్‌ అంజి, కెమెరామెన్‌ మల్లికార్జున నారగాని తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు