This Friday OTT Movie Releases: ఓటీటీల్లో ఒకేరోజు 18 మూవీస్ రిలీజ్.. అవి మాత్రం స్పెషల్

8 Nov, 2023 23:10 IST|Sakshi

మరో వీకెండ్ వచ్చేసింది. ఈసారి దీపావళి స్పెషల్ కానుకగా 'జపాన్', 'జిగర్ తాండ', 'టైగర్ 3' లాంటి డబ్బింగ్ మూవీస్ మాత్రమే థియేటర్లలోకి వస్తున్నాయి. చెప్పుకోదగ్గ తెలుగు సినిమాలు బిగ్ స్క్రీన్‌పై రిలీజ్ కావడం లేదు. దీంతో ఆటోమేటిక్‪‌గా ప్రేక్షకుల దృష్టి ఓటీటీలపై పడుతుంది. అందుకు తగ్గట్లే ఈ శుక్రవారం బోలెడన్ని కొత్తకొత్త సినిమాలు-సిరీసులు రెడీ అయిపోయాయి.

(ఇదీ చదవండి: హగ్గులు-కిస్సులతో ఊపిరాడనివ్వలేదు.. ఆ ఇద్దరి గురించి ప్రియాంకకు వార్నింగ్!)

ఈ సోమవారం ఓటీటీ మూవీస్ లిస్ట్ ప్రిపేర్ చేసేటప్పటికీ 20కి పైగా సినిమాలు వచ్చాయి. కానీ వీటిలో కొన్ని ఇప్పటికే స్ట్రీమింగ్ అయిపోతుండగా, మరికొన్ని కొత్తగా వచ్చి చేరాయి. అలా ఈ శుక్రవారమే దాదాపు 18 మూవీస్-వెబ్ సిరీసులు రిలీజ్ కానున్నాయి. వీటిలో పిప్పా, ద రోడ్, కన్నూరు స్క్వాడ్, ఘూమర్, ద బాయ్స్ హాస్టల్ సినిమాలతో పాటు లేబుల్ అనే వెబ్ సిరీస్ ఆసక్తి కలిగిస్తోంది. వీటిలో మీ ఛాయిస్ ఏంటి?

ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలు (నవంబరు 10)

నెట్‌ఫ్లిక్స్

  • ఎట్ ద మూమెంట్ - మాండరిన్ సిరీస్
  • ఫేమ్ ఆఫ్టర్ ఫేమ్ - స్పానిష్ సిరీస్
  • ద కిల్లర్ - ఇంగ్లీష్ సినిమా
  • అకుమా కున్ - జపనీస్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది)

అమెజాన్ ప్రైమ్

  • 007: రోడ్ టూ ఏ మిలియన్ - ఇంగ్లీష్ సిరీస్
  • దిన్ హసీమ్ - ఇంగ్లీష్ స్టాండప్ కామెడీ షో
  • పిప్పా - హిందీ చిత్రం
  • పులిక్కుత్తు పండి - తమిళ మూవీ
  • హ్యాక్ క్రైమ్స్ ఆన్‌లైన్ - హిందీ సిరీస్
  • క్రష్డ్ సీజన్ 3 - హిందీ సిరీస్  (నవంబరు 11)
  • BTS ఎట్ టూ కమ్ - కొరియన్ సినిమా (ఆల్రెడీ స్ట్రీమింగ్)

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

  • కన్నూరు స్క్వాడ్ - తెలుగు డబ్బింగ్ మూవీ
  • లేబుల్ - తెలుగు డబ్బింగ్ సిరీస్

జీ5

  • ఘూమర్ - హిందీ సినిమా 

ఆహా

  • ద రోడ్ - తెలుగు డబ్బింగ్ చిత్రం

బుక్ మై షో

  • ద అడల్ట్స్ - ఇంగ్లీష్ మూవీ

లయన్స్ గేట్ ప్లే

  • వాట్స్ లవ్ గాట్ టుడూ విత్ ఇట్ - ఇంగ్లీష్ సినిమా

ఈ - విన్

  • ద బాయ్స్ హాస్టల్ - తెలుగు డబ్బింగ్ మూవీ

(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'టైగర్ నాగేశ్వరరావు'.. అనుకున్న టైమ్ కంటే ముందే?)

మరిన్ని వార్తలు