మురళీమోహన్పై దర్శకుడి మండిపాటు

27 Mar, 2015 18:01 IST|Sakshi

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ప్రస్తుత అధ్యక్షుడు మురళీమోహన్పై దర్శకుడు శ్రీనాథ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మా అంటే మురళీమోహన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్గా తయారు చేశారని ఆయన విమర్శించారు. ఆయన చాలా కాలం పాటు 'మా' అధ్యక్ష పదవిని నిర్వహించారని, చంద్రబాబు వద్ద పనిచేసినా కూడా.. 'మా' కోసం ఒక్క భవనం కూడా తీసుకురాలేకపోయారని శ్రీనాథ్ విమర్శించారు.

అన్ని పదవులూ మురళీమోహనే అనుభవించాలనుకుంటున్నారని, బతికున్న లెజెండ్స్ను మర్చిపోయి.. చనిపోయినవారి కోసం మృత్యుంజయ హోమం చేయించారని దర్శకుడు శ్రీనాథ్ అన్నారు.