సైరా కటౌట్‌ అంటే ఆమాత్రం ఉండాలి!

2 Oct, 2019 12:56 IST|Sakshi

‘సైరాకు లేదు పోటీ.. చిరుకు రారెవరు సాటి!’ ప్రస్తుతం అభిమానులు ముక్తకంఠంతో అంటున్న మాట ఇది. గత కొంతకాలంగా సైరా మేనియాతో ఊగిపోతున్న అభిమానులకు అసలైన పండగ రానే వచ్చింది. బ్రిటీషర్లపై ఉక్కుపాదం మోపిన స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా సైరా చిత్రం రూపొందించిన సంగతి తెలిసిందే! మెగాస్టార్‌ చిరంజీవి నటించిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం నేడు విడుదల అవడంతో అభిమానుల ఆనందానికి అంతు లేకుండా పోయింది. అభిమానులు థియేటర్ల వద్ద పోటెత్తుతున్నారు. అంతేకాక చిరుకు కానుకగా ఆయన కటౌట్లను ఏర్పాటు చేసి సందడి చేస్తున్నారు.

డై హార్డ్‌ ఫ్యాన్స్‌ అయితే మరో అడుగు ముందుకేసి వారికున్న ఎవరెస్టు శిఖరమంత ప్రేమను చాటుకోవడానికి అత్యంత భారీ కటౌట్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. చిరంజీవి జీవితంలోనే ఇది భారీ కటౌట్‌ అని ఆయన ఫ్యాన్స్‌ చెపుతున్నారు. ఈ భారీ కటౌట్‌లో చిరంజీవిని శిరస్సు నుంచి పాదాల వరకు పూలమాలలతో ఘనంగా ముస్తాబు చేశారు. దీనికోసం త్రివర్ణాలతో కూడిన పూలదండలను ఉపయోగించారు. ప్రస్తుతం ఈ కటౌట్‌ అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇక ఈ చిత్రానికిగానూ అడ్వాన్స్‌ టికెట్ల బుకింగ్‌ అ‍మ్మకాలు తారాస్థాయిలో జరగాయి. దీనికి తోడు పండగ సెలవులు కూడా సైరా కలెక్షన్లకు కలిసొచ్చే అంశంగా మారనుంది. మరి ఈ చారిత్రాత్మక చిత్రంతో చిరంజీవి రికార్డులపరంగా చరిత్ర సృష్టిస్తారా అనేది చూడాలి!

చదవండి.. సైరా ఫుల్‌ రివ్యూ (4/5)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా