World Cup 2023 Finals: వన్డే ప్రపంచకప్‌పై 9 థీమ్ సాంగ్స్.. అది మాత్రం చాలా స్పెషల్!

18 Nov, 2023 21:09 IST|Sakshi

వన్డే వరల్డ్‌కప్ తుది సమరానికి రంగం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో మొదలయ్యే భారత్-ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ కోసం యావత్ దేశం ఎదురుచూస్తోంది. ఇందులో టీమిండియా గెలుస్తుందా? మూడోసారి కప్ కొడుతుందా? అని కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. సరే దాని గురించి కాసేపు పక్కనబెట్టేసి ఈ వరల్డ్‌కప్.. వాటి థీమ్ సాంగ్స్ గురించి కాసేపు మాట్లాడుకుందాం.

(ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భర్త వరుణ్ గురించి లావణ్య ఫస్ట్ పోస్ట్!)

గ్రౌండులో క్రికెట్ ఆడినా సరే మరీ సైలెంట్‌గా ఉంటే ఎంటర్ టైన్ మెంట్ ఉండదు కాబట్టి స్టేడియంలో పాటలు ప్లే చేస్తుంటారు. అలానే వన్డే ప్రపంచకప్ లాంటి పెద్ద టోర్నీలు నిర్వహించినప్పుడు.. దీన్ని జనాల్లోకి తీసుకెళ్లేందుకు థీమ్ సాంగ్స్ లాంటివి రెడీ చేస్తుంటారు. 1992 ప్రపంచకప్ నుంచి ఈ థీమ్ గీతాల కల్చర్ మొదలైందని చెప్పొచ్చు. 

ప్రస్తుత వరల్డ్‌కప్‌కి కూడా 'దిల్ జస్న్ భోలె' అని ఓ పాట రెడీ చేశారు. కాకపోతే దానికి అనుకున్నంత రీచ్ రాలేదని చెప్పొచ్చు. ఇప్పటివరకు దాదాపు 9 పాటలొస్తే.. వాటిలో 2011 ప్రపంచకప్ కోసం శంకర్ ఎహసన్ లాయ్ కంపోజ్ చేసిన పాడిన 'దేఖ్ గుమాంగే'.. ఇప్పటివరకు వచ్చిన వాటిలో ది బెస్ట్ అని చెప్పొచ్చు. ప్రపంచకప్ కోసం తయారు చేసిన మొత్తం పాటలు ఇవిగో. ఓసారి వినండి. ఏదో బెస్ట్ మీరే చెప్పండి.

(ఇదీ చదవండి: వన్డే వరల్డ్‌కప్ ఫైనల్.. ఆ తెలుగు హీరోలందరూ గ్యారంటీగా!)

1992 ప్రపంచకప్ థీమ్ సాంగ్: హూ రూల్ ద వరల్డ్

1996 ప్రపంచకప్ థీమ్ సాంగ్: చోక్రా

1999 ప్రపంచకప్ థీమ్ సాంగ్: లైఫ్ ఈజ్ ఈ కార్నివాల్

2003 ప్రపంచకప్ థీమ్ సాంగ్: వెల్కమ్ టూ అవర్ హోమ్

2007 ప్రపంచకప్ థీమ్ సాంగ్: గేమ్ ఆఫ్ లవ్ అండ్ యూనిటీ

2011 ప్రపంచకప్ థీమ్ సాంగ్: దేఖ్ గుమాంగే

2015 ప్రపంచకప్ థీమ్ సాంగ్: WDL బాబ్స్ బీట్

2019 ప్రపంచకప్ థీమ్ సాంగ్: లోరిన్

2023 ప్రపంచకప్ థీమ్ సాంగ్: దిల్ జస్న్ భోలే

మరిన్ని వార్తలు