ముఖ్యమంత్రి నిర్ణయంతో 30వేల మంది కళాకారులకు ఉపాధి

27 May, 2020 00:01 IST|Sakshi
చైతన్య జంగా, పాకలపాటి విజయవర్మ

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌కు ఎఫ్‌టిపీసీఏపి కృతజ్ఞతలు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఫిలిం అండ్‌ టెలివిజన్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (ఎఫ్‌టిపీసీఏపి) అధ్యక్ష, కార్యదర్శులు చైతన్య జంగా, పాకలపాటి విజయ్‌వర్మ కృతజ్ఞతలు తెలిపారు. లాక్‌డౌన్‌తో ఇబ్బందుల్లో ఉన్న సినీ పరిశ్రమకు మేలు కలిగే నిర్ణయాలతో పాటు.. సింగిల్‌ విండో అనుమతులకు జీవో విడుదల చేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా చైతన్య జంగా, పాకలపాటి విజయ్‌వర్మ మాట్లాడుతూ – ‘‘ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో చలనచిత్ర మరియు టెలివిజన్‌ షూటింగులను అనుమతించాలనే ప్రభుత్వ నిర్ణయానికి ధన్యవాదాలు.

షూటింగులకు అనుమతివ్వడం కారణంగా 30వేల మంది కార్మికులు, సాంకేతిక నిపుణులు, కళాకారులకు ఉపాధి లభిస్తుంది. అదే విధంగా షూటింగుల సమయంలో భౌతిక దూరాన్ని కొనసాగించడం ఎంతో కష్టసాధ్యం కాబట్టి నిర్మాణ సంస్థలు శానిటైజర్లు, మాస్క్‌లు అందజేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. సింగిల్‌ విండో ద్వారా షూటింగ్‌లకు అనుమతివ్వడం, ఉచితంగా లొకేషన్‌ను ఇవ్వడం ద్వారా నిర్మాణ ఖర్చులు కూడా ఎంతగానో తగ్గుతాయి. ఇలాంటి గొప్ప నిర్ణయం తీసుకున్నందుకు వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిగారికి, ఎఫ్‌టిపీసీఏపీ ఛైర్మన్‌ విజయ్‌చందర్‌కి కృతజ్ఞతలు’’ అన్నారు.

మరిన్ని వార్తలు