అంగరంగ వైభవంగా హీరోయిన్‌ కార్తిక పెళ్లి.. హాజరైన చిరంజీవి,సినీ ప్రముఖులు

19 Nov, 2023 16:31 IST|Sakshi

సీనియర్‌ నటి రాధ కుమార్తె, హీరోయిన్‌ కార్తిక వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఆదివారం(నవంబర్‌ 19) ఉదయం రోహిత్‌ మేనన్‌తో కార్తిక మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టింది.  తిరువనంతపురంలోని కవడియార్ ఉదయపాలస్ కన్వెన్షన్ సెంటర్‌లో..కేరళ సంప్రదాయంలో వీరిద్దరి వివాహం జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్‌ చిరంజీవి-సురేఖ దంపతులు, రాధిక, సుహాసిని తదితరులు హాజరై, నూతన వధూవరులను ఆశ్వీరదించారు. ప్రస్తుతం కార్తిక పెళ్లి ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. 

కాగా, జోష్‌(2009) సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది కార్తిక. ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడినా.. కార్తిక నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత జీవా నటించిన ‘రంగం’ సినిమాతో సూపర్‌ హిట్‌ అందుకుంది. ఆ తర్వాత వరుసగా తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో నటించింది. బ్రదర్ ఆఫ్ బొమ్మాళి, దమ్ము చిత్రాల్లో కీలక పాత్రలు పోషించింది. 2015 నుంచి కార్తిక చిత్రపరిశ్రమకు దూరంగా ఉంటుంది. ప్రస్తుతం వ్యాపార రంగంలో బిజీ అయిపోయింది. 

👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

A post shared by Neelakkuyil Entertainments (@neelakkuyil_entertainments)

A post shared by Neelakkuyil Entertainments (@neelakkuyil_entertainments)

A post shared by Radikaa Sarathkumar (@radikaasarathkumar)

A post shared by Suhasini Hasan (@suhasinihasan)

మరిన్ని వార్తలు