ప్రెగ్నెంట్‌ లేడీగా కీర్తీ సురేష్‌

17 Oct, 2019 20:47 IST|Sakshi

మహానటి సినిమా తర్వాత కీర్తీ సురేష్‌ గ్రాఫ్‌ ఒక్కసారిగా పెరిగిపోయింది. కోలివుడ్‌లో చిన్న హీరోయిన్‌గా కెరీర్‌ను ప్రారంభించిన కీర్తీ.. ప్రస్తుతం తెలుగులో టాప్‌ హీరోయిన్‌గా కొనసాగుతోంది. ముఖ్యంగా లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు  కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. సౌత్ లో నయనతార తర్వాత ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు కీర్తి సురేష్ ను ఎక్కువగా సంప్రదిస్తున్నారు. ప్రస్తుతం ఈమె 'పెంగ్విన్' అనే లేడీ ఓరియంటెడ్ చిత్రంలో నటిస్తోంది.  ఈశ్వర్ కార్తిక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు కార్తీక్‌సుబ్బరాజ్‌ నిర్మిస్తున్నాడు. ఈ చిత్ర టైటిల్‌ను ,ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను కీర్తీసురేశ్‌ పుట్టిన రోజు సందర్భంగా  గురువారం చిత్ర వర్గాలు విడుదల చేశారు.

ఇందులో మెహందీ సర్కస్‌ చిత్రం ఫేమ్‌  రంగరాజ్‌ మాదంపట్టి ముఖ్య పాత్రలో  నటిస్తున్నాడు. కీర్తీసురేశ్‌ నీలి నీడ ఫోటోతో కూడిన పెన్‌గ్విన్‌ చిత్ర పోస్టర్‌ సినీ వర్గాల్లో ఆసక్తిని రేకరెత్తిస్తోంది. చిత్రాన్ని  2020లో సమ్మర్‌ స్ఫెషల్‌గా  విడుదల చేయడానికి చిత్ర వర్గాలు సన్నాహాలు చేస్తున్నారు. కాగా కీర్తీసురేశ్‌ దీనితో పాటు తెలుగులోనూ రెండు చిత్రాలు చేస్తోంది. కాగా తాజాగా సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ 168వ చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుందనే ప్రచారం  జోరందుకుంది.

సినిమాలో ఎక్కువ సమయం కీర్తి సురేష్ గర్భవతిగా కనిపించనుందని.. అందుకే ఫస్ట్ లుక్ గా గర్భవతిగా ఉన్న ఫొటోను విడుదల చేశారంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. మహానటి చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్న కీర్తీ సురేష్ మరోసారి ఈ చిత్రంలోని నటనతో జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటుందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా