జూనియర్ పవన్లు ఏం చేశారు?

17 Sep, 2015 12:52 IST|Sakshi
జూనియర్ పవన్లు ఏం చేశారు?

వినాయకచవితి వచ్చిందంటే పిల్లలకు పండగే. గణపతిని రకరకాలుగా అలంకరించడానికి పొద్దున్నే లేచి.. స్నానం చేసి రెడీ అయిపోతారు. తమకు చేతనైన రీతిలో అందంగా గణేశుడికి అలంకారాలు చేసి మురిసిపోతారు, మురిపిస్తారు కూడా. ఎకో ఫ్రెండ్లీ గణేశుడిని తయారు చేయడం ఇప్పుడు అందరికీ బాగా అలవాటైంది. ఎలాంటి ప్లాస్టిక్ పదార్థాలు, కృత్రిమ రంగులు ఉపయోగించకుండా.. మట్టితోను, అందుబాటులో ఉన్న రంగులతోను వినాయకుడి విగ్రహాలను చేస్తున్నారు.

అలాగే పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్, ఆద్య ఇద్దరూ కలిసి మంచి వినాయకుడి విగ్రహాన్ని తయారు చేశారు. పుణెలో తల్లి రేణు దేశాయ్ వద్ద ఉంటున్న అకీరా, ఆద్య కలిసి ఎలాంటి థర్మోకోల్, ప్లాస్టిక్ డెకరేషన్లు ఉపయోగించకుండా గణపతిని తయారు చేశారు. కొబ్బరి కాయలు, పూలు, పళ్లతో పూజ చేసుకున్నారు. ఈ విషయాన్ని రేణు దేశాయ్ ట్వీట్ చేశారు. తమ పిల్లల కళను అందరికీ పరిచయం చేశారు.