చంద్రబాబు దుర్మార్గపు పాలనలో పవన్‌ పాత్ర: మంత్రి అంబటి

14 Nov, 2023 13:41 IST|Sakshi

సాక్షి, తూర్పుగోదావరి: కొవ్వూరు మండలం పెనకన మెట్ట గ్రామంలో మంత్రి అంబటి రాంబాబు, హోం మంత్రి తానేటి వనిత మంగళవారం పర్యటించారు. గ్రామంలో కోటి 35 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు, రైతు భరోసా కేంద్రం, సచివాలయ భవనాన్ని మంత్రులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అంబటి మాట్లాడుతూ.. రాష్ట వ్యాప్తంగా అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమలు జరగుతున్నాయన్నారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నారు కాబట్టే మళ్లీ సీఎంగా జగనే కావాలని, పేదల కోసం ఆయన నిరంతరం ఆలోచిస్తున్నారని మంత్రి అన్నారు.

‘‘చంద్రబాబు మహిళలను మోసం చేశాడు. బంగారు రుణాలు మాఫీ అంటూ చేతులెత్తేశాడు. చంద్రబాబు దుర్మార్గపు పాలనలో పవన్‌ పాత్ర కూడా ఉంది. సీఎం జగన్‌ ఇచ్చిన హామీలను అన్ని అమలు చేశారు. అభివృద్ధి ఫలాలు ప్రతి గ్రామానికి అందిస్తున్నాం. వై ఏపీ నీడ్స్ జగన్ అని ప్రజల్లోకి వెళ్తున్నాం. ఏ రాష్ట్రాల్లో కూడా అమ్మ ఒడి లాంటి పథకం లేదు. పేదల కోసం అహర్నిశలు శ్రమిస్తున్న సీఎం జగన్‌ రాష్ట్రానికి కావాలి. ఆయనే మరలా రాష్ట్రానికి సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. 2024లో పేదలకు-పెత్తందారులు జరిగే ఎన్నిక ఇది. పేదల తరపున పోటీ చేసి గెలిచే వ్యక్తి సీఎం జగన్‌. పవన్ కళ్యాణ్ చంద్రబాబును భుజానికి ఎత్తుకున్నాగెలిచేది జగనే ’’ అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.
చదవండి: ఈనాడు రామోజీతో ఏబీఎన్‌ రాధాకృష్ణ పోటీ పడుతున్నాడా?

మరిన్ని వార్తలు