శింబూ కోసం రైటర్‌గా..

12 Aug, 2017 00:18 IST|Sakshi
శింబూ కోసం రైటర్‌గా..

గౌతమ్‌ మీనన్‌ మంచి దర్శకుడనే విషయం అందరికీ తెలుసు. ‘ఘర్షణ’, ‘ఏ మాయ చేశావె’, ‘సాహసం శ్వాసగా సాగిపో’ వంటి చిత్రాలు అందుకు ఉదాహరణ. తమిళంలో తాను దర్శకత్వం వహించే చిత్రాలకు గౌతమ్‌ సంభాషణలు రాస్తుంటారు. ఇప్పుడు శింబు హీరోగా నటించి, దర్శకత్వం వహించనున్న చిత్రానికి డైలాగ్స్‌ రాయడానికి అంగీకరించారు.

అది కూడా ఇంగ్లిష్‌ డైలాగ్స్‌. ఈ చిత్రాన్ని ఇంగ్లిష్‌లో తీసి, ఆ తర్వాత తమిళ్, ఇతర దక్షిణాది భాషల్లోకి అనువదించాలనుకుంటున్నామని శింబు పేర్కొన్నారు. గౌతమ్‌ తీసిన ‘విన్నైత్తాండి వరువాయా’ (తెలుగులో ‘ఏ మాయ చేశావె’)లో, ‘అచ్చమ్‌ ఎన్బదు మడమయడా’ (తెలుగులో ‘సాహసం శ్వాసగా సాగిపో’) లోనూ శింబూనే హీరో. ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉన్న కారణంగానే శింబూకి గౌతమ్‌ డైలాగ్స్‌ రాస్తున్నారని ఊహించవచ్చు.