శింబు, హన్సికల ప్రేమ వ్యవహారం అలా మొదలైంది !

1 Aug, 2013 01:03 IST|Sakshi
శింబు, హన్సికల ప్రేమ వ్యవహారం అలా మొదలైంది !

 కోలీవుడ్‌లో ఇప్పటికీ చాలామందిని ఆశ్చర్యపరిచే విషయం శింబు, హన్సిక ప్రేమ వ్యవహారం. వాళ్లిద్దరూ బహిరంగంగా తమ ప్రేమను వెల్లడించినా అది నిజమేనా? అనే భ్రమలో చాలామంది ఉన్నారు. ఇలాంటి తరుణంలో శింబుతో తన ప్రేమ ఎలా మొగ్గ తొడిగింది లాంటి విషయాలను హన్సిక తన స్నేహితురాళ్లతో పదేపదే చెబుతూ ముచ్చటపడిపోతోందట. నయనతారతో ప్రేమ పెళ్లి వరకు దారి తీస్తుందని అందరూ భావించిన తరుణంలో బ్రేక్ అప్ అవడంతో శింబును చూస్తేనే ఇతర హీరోయిన్లు భయపడేవాళ్లు.
 
 ఆయనతో నటిస్తే ప్రేమ వదంతులకు రెక్కొలొచ్చేసాయి, మన మార్కెట్‌కు ఎఫెక్ట్ అవుతుందని పలువురు హీరోయిన్లు శింబుకు దూరంగా ఉన్నారు. అలాంటి సమయంలో నటి హన్సిక శింబుతో ఒకటి కాదు ఏకంగా రెండు చిత్రాలలో నటించడానికి ఓకే చెప్పేసింది. ఆ సమయంలో శింబు, నయనతార ప్రేమించుకుని విడిపోయిన విషయాన్ని కొందరు శ్రేయోభిలాషులు హన్సికకు చెప్పి హెచ్చరించారట. దీంతో మొదట్లో శింబు సరసన నటించేటప్పుడు హన్సిక భయంతో దూరంగానే ఉండేదట. అయితే పోగాపోగా శింబు మాటల తీరు ఆమె మదిని దోచాయట. మెల్లమెల్లగా స్నేహం, ప్రేమ పుట్టుకొచ్చాయట. తర్వాత సంగతి తెలిసిందే.

>