నిట్‌తోనే నాకు గుర్తింపు

4 Nov, 2019 10:22 IST|Sakshi

సాక్షి, కాజీపేట అర్బన్‌ : నిట్‌ వరంగల్‌లో విద్యనభ్యసించడం ద్వారానే సినీ రంగంలో ప్రత్యేక గుర్తింపు లభించిందని ఆర్‌ఎక్స్‌ –100 హీరో కార్తి్కేయ తెలిపారు. నిట్‌లో నిర్వహిస్తున్న టెక్నోజియాన్‌–19 నోవస్‌ ముగింపు సందర్భంగా ఆదివారం గెస్ట్‌లెక్చర్‌లో భాగంగా ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ‘సాక్షి’తో తన సినీరంగ ప్రవేశం, నిట్‌ జ్ఞాపకాలను పంచుకున్నారు. చిన్నప్పటి నుంచి మెగాస్టార్‌ చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగానని, ఆయన స్ఫూర్తితో యాక్టింగ్‌ తనను సినీరంగంలోకి అడుగుపెట్టేందుకు దోహదపడిందన్నారు. 

నిట్‌తోనే హీరోగా ఎదిగే అవకాశం
మాది హైదరాబాద్‌ విఠల్‌రెడ్డి, రజితలు నా తల్లిదండ్రులు. నాన్న అమ్మా నాగార్జున గ్రుప్‌ ఆఫ్‌ స్కూల్స్‌ను నిర్వహిస్తున్నారు. నన్ను మా అమ్మ ఎంతో ఇష్టపడి, నన్ను కష్టపెట్టి నిట్‌ వరంగల్‌లో సీటు సాధించే విధంగా చదివించింది. కానీ నాకు యాక్టింగ్‌ అంటే పిచ్చి. మా సీనియర్‌ మణికాంత్‌ తాను తీసే షార్‌ ఫిల్మ్స్‌లో నేను నటించేవాడిని. డ్యాన్స్‌ చేసే వాడిని నా తొలి డైరెక్టర్, అభిమాని తానే. నిట్‌ వరంగల్‌లో 2010 బ్యాచ్‌లో కెమికల్‌ ఇంజనీరింగ్‌లో చేరాను.

టెక్నోజియాన్, స్ప్రీంగ్‌స్ప్రీలలో ఆడీనైట్‌లో నా డ్యాన్స్‌తో మైమరపించేవాడ్ని, గుడ్‌ డ్యాన్సర్‌ అంటూ అమ్మాయిలు మెసేజ్‌ పెట్టేవారు. నాలుగు సంవత్సరాల నిట్‌ విద్యాభ్యాసంలో నాలుగు వేల మందిని అలరించడంతో ధైర్యం వచ్చింది.  నిట్‌లో చదువుకుంటున్న సమయంలో రామప్ప, వెయ్యిస్తంభాల గుడి, లక్నవరాన్ని సందర్శించేవాడ్ని.   ప్రతి సినిమాను  భవానీ టాకీస్‌లో చూసేవాడ్నీ. 

క్యాంపస్‌ ఇంటర్వ్యూలు వదిలేశా..
చిన్నప్పటి నుంచి యాక్టర్‌ కావాలనేదే నా ఆశయం. దీంతో నిట్‌లో ఉన్న నాలుగు సంవత్సరాలు యాక్టింగ్‌పైనే దృష్టి పెట్టాను. కళాశాలలో ప్రతి ఒక్క విద్యార్థి, ప్రొఫెసర్లు నన్ను యాక్టర్‌ అవుతావని ఎంకరేజ్‌ చేశారు. యాక్టర్‌ కావాలనే సంకల్పంతో నిట్‌లో క్యాంపస్‌ ఇంటర్వ్యూలు కూడా వదులుకున్నాను.  నిట్‌లో చదువుకునే అవకాశం రావడం అదృష్టం. నిట్‌లో నుంచి బయటకు వెళ్లే సమయం ఫైనల్‌ ఇయర్‌లోనే కెరీర్‌ ఫైనల్‌ కావాలి.  

ఆర్‌ఎక్స్‌–100తో హీరోగా గుర్తింపు...
నిట్‌ నుంచి 2014 బీటెక్‌ పూర్తి చేసి బయటకు వెళ్లిన తర్వాత సుబ్బారావు నేషనల్‌ యాక్టింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో యాక్టింగ్‌ కోర్సులో చేరాను. 2018లో డైరెక్టర్‌ అజయ్‌ ఆర్‌ఎక్స్‌–100కు హీరోగా సెలెక్ట్‌ చేశారు. ఆర్‌ఎక్స్‌–100 నన్ను యాక్టర్‌గా, హీరోగా నిలబెట్టి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చింది. గ్యాంగ్‌ లీడర్‌లో నాని హీరోగా మంచి హీరోయిజంతో కూడిన విలన్‌ పాత్రను డైరెక్టర్‌ గుణ æవివరించగా ఒప్పుకున్నాను.

త్వరలో 90 ఎంఎల్‌ సినిమాతో మీ ముందుకు వస్తున్నాను.
నేను చదువుకున్న నిట్‌ వరంగల్‌కు నేను హీరోగా మారి అతిథిగా రావడం ఆనందంగా ఉంది. నాడు నేను చదువుకున్న తరగతులు, నేను డ్యాన్స్‌ చేసిన, నన్ను యాక్టర్‌గా తీర్చిదిద్దిన ఆడిటోరియాన్ని మరువలేను.  

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా