పెళ్లి గురించి ఓపెన్ అయినా వరుణ్‌ తేజ్‌..

16 Feb, 2018 12:46 IST|Sakshi

మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌ నటించిన ‘తొలిప్రేమ’ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్లు కురిపిస్తోంది. ఈ సినిమాలో వరుణ్‌ తేజ్‌కు జంటగా రాశీఖన్నా నటించింది. వెంకీ అట్లూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. యూత్‌ఫుల్‌ లవ్‌స్టోరి కావడంతో యువతలో మంచి ఆదరణ లభిస్తోంది. వరుణ్‌ తేజ్‌కు ఫిదా మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ‘తొలిప్రేమ’ విజయంతో వరుణ్‌ తేజ్‌ ఇంటర్వ్యూలతో బిజీ అయిపోయ్యారు.

ఓ ఇంటర్వ్యూలో వరుణ్‌ని మ్యారేజ్‌ గురించి ఓ ప్రశ్న అడిగారట. ఈ ప్రశ్నపై వరుణ్‌.. ప్రభాస్‌, నితిన్‌ల పెళ్లి అయిపోయిన తర్వాత తాను వివాహం చేసుకుంటానని సమాధానం ఇచ్చారని తెలుస్తోంది. ‘తొలిప్రేమ’ విడుదలైనప్పటి నుంచి పాజిటివ్‌ టాక్‌తో విజయవంతంగా నడుస్తోంది. ప్రస్తుతం వరుణ్‌ ‘ఘాజి’  డైరెక్టర్‌ సంకల్ప్‌ రెడ్డి దర్శకత్వంలో నటించనున్నారు.

మరిన్ని వార్తలు