దుమ్ము దులపాలి

19 Jan, 2020 00:50 IST|Sakshi
విష్ణు మంచు

విష్ణు మంచు కథానాయకుడిగా నటిస్తోన్న తాజా చిత్రం ‘మోసగాళ్ళు’. ఈ చిత్రానికి జెఫ్రీ గీ చిన్‌  దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సునీల్‌ శెట్టి, కాజల్‌ అగర్వాల్‌ ప్రధాన పాత్రధారులు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో జరుగుతోంది. విష్ణు, సునీల్‌ శెట్టిల మధ్య ఓ భారీ యాక్షన్‌  సీక్వెన్స్‌ను తెరకెక్కిస్తున్నారు. హాలీవుడ్‌ యాక్షన్‌  నిపుణుల పర్యవేక్షణలో జరుగుతున్న ఈ ఫైట్‌ కోసం విష్ణు మంచు, సునీల్‌ శెట్టి ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ‘‘మోసగాళ్ళు’ షూటింగ్‌ మొదలైంది.

ఈ వారం షూటింగ్‌లో దుమ్ము దులపాలి’’ అన్నారు విష్ణు. ‘‘ఇప్పటివరకు తెలుగుతెరపై ఇలాంటి యాక్షన్‌  సీక్వెన్స్‌ను ప్రేక్షకులు చూసి ఉండరు. యాక్షన్‌ లవర్స్‌కు ఈ సీక్వెన్స్‌ అదిరిపోయేలా ఉంటుంది’’ అని చిత్ర బృందం పేర్కొంది. నవదీప్, నవీన్‌  చంద్ర, రూహీ సింగ్‌ తదితరులు నటిస్తున్న ఈ సినిమాను విష్ణు మంచు నిర్మిస్తున్నారు. సైబర్‌ క్రైమ్స్‌ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని సమాచారం. ‘మోసగాళ్ళు’ చిత్రం ఈ వేసవిలో విడుదల కానుంది. ఈ సినిమాకు షెల్డన్‌  చౌ ఛాయాగ్రాహకుడు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: విజయ్‌ కుమార్‌. ఆర్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా