అనుబంధాల వారధి

26 Jan, 2018 01:00 IST|Sakshi

రాహుల్‌ రవీంద్రన్, చాందిని చౌదరి, మనాలీ రాథోడ్‌ హీరో హీరోయిన్లుగా రేవన్‌ యాదు దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘హౌరా బ్రిడ్జ్‌’.  ఇ.ఎమ్‌.వి.ఇ స్టూడియోస్‌ ప్రై లిమిటెడ్‌ సంస్థ నిర్మించింది. ‘‘ఈ సినిమాకు ‘హౌరా బ్రిడ్జ్‌’ అనే టైటిల్‌ పెట్టడం వెనుక ఓ రీజన్‌ ఉంది. హ్యూమన్‌ రిలేషన్స్‌ ఒక బ్రిడ్జ్‌ అయితే ఈ సినిమాలో మరో బ్రిడ్జ్‌ ఏంటి అనేది సస్పెన్స్‌.

చాందిని చౌదరి, మనాలీ బాగా యాక్ట్‌ చేశారు. దర్శకుడు చాలా క్లారిటీతో ఈ సినిమా తెరకెక్కించారు’’ అని పేర్కొన్నారు రాహుల్‌ రవీంద్రన్‌. ‘‘రాహుల్‌ అద్భుతంగా నటించారు. మంచి ట్విస్టులతో సినిమా ఆసక్తికరంగా సాగుతుంది. కుటుంబసమేతంగా చూడదగ్గ చిత్రమిది’’ అని దర్శకుడు అన్నారు. రావు రమేశ్, పోసాని కృష్ణమురళి, అజయ్‌ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఫిబ్రవరి 2న విడుదల కానున్న ఈ సినిమాకు సంగీతం: శేఖర్‌ చంద్ర, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వర రావు, కెమెరా: విజయ్‌ మిశ్రా.

మరిన్ని వార్తలు