మాస్‌ రింగు... 

11 Nov, 2023 03:33 IST|Sakshi

‘బిగ్‌ బాస్‌’ ఫేమ్‌ సోహైల్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘బూట్‌కట్‌ బాలరాజు’. శ్రీ కోనేటి దర్శకత్వంలో గ్లోబల్‌ ఫిలిమ్స్‌– కథ వేరుంటాది బ్యానర్స్‌పై ఎండీ పాషా నిర్మిస్తున్నారు. మేçఘా లేఖ, సునీల్, సిరి హన్మంత్, ఇంద్రజ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘రింగు రింగు బిళ్ల..’ అంటూ సాగే టైటిల్‌ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటకి దేవ్‌ పవార్‌ సాహిత్యం అందించగా, భోలే షావలి, రఘురామ్‌ పాడారు. ప్రేమ్‌ రక్షిత్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీ అందించారు. ‘‘ఫుల్‌ మాస్‌గా ‘రింగు రింగు బిళ్ల..’ సాంగ్‌ ఉంటుంది. సోహైల్‌ చేసిన మాస్‌ డ్యాన్స్‌ మూమెంట్స్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి’’ అన్నారు మేకర్స్‌.   

మరిన్ని వార్తలు