మరో ఇంట్రస్టింగ్‌ టైటిల్‌తో అవసరాల

14 Mar, 2019 15:26 IST|Sakshi

కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చి తరువాత దర్శకుడిగా మారిన యువ నటుడు అవసరాల శ్రీనివాస్‌. అష్టా చమ్మా సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన అవసరాల కొద్ది రోజుల్లోనే ఊహలు గుస గుసలాడే సినిమాతో దర్శకుడిగా మారాడు. రెండో ప్రయత్నంగా జ్యో అచ్చుతానంద సినిమా డైరెక్ట్ చేసిన అవసరాల శ్రీనివాస్‌ లాంగ్ గ్యాప్ తరువాత మూడో సినిమాకు రెడీ అవుతున్నాడు.

నాగశౌర్య హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు కూడా తన మార్క్ ఇంట్రస్టింగ్ టైటిల్‌ను ఫిక్స్ చేశాడు. అచ్చమైన తెలుగు టైటిల్స్‌ను ఎంచుకున్న ఈ యువ దర్శకుడు తదుపరి చిత్రాన్ని పలానా అబ్బాయి.. పలానా అమ్మాయి అనే టైటిల్‌ను ఫిక్స్ చేశాడు. ఈ సినిమాలో నాగశౌర్యకు జోడిగా మాళవిక నాయర్‌ నటిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్‌ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది.

మరిన్ని వార్తలు