‘గతంలో ఎప్పుడూ చూడని విధంగా..’

2 May, 2020 17:12 IST|Sakshi

అందం అభినయం ఆమె సొంతం.. ‘హీరోయిన్‌గా మాత్రమే’అని పట్టుపట్టకుండా చిన్న చిన్న మెరుపులాంటి పాత్రలో పాటు, ఐటమ్‌ సాంగ్స్‌తోనూ కుర్రకారు మనసు దోచుకుంటోంది బాలీవుడ్‌ భామ జాక్వలిన్‌ ఫెర్నాండేజ్‌. ‘సాహో’లో ప్రభాస్‌ పక్కన ఓ పాటలో మెరిసిన జాక్వలిన్‌ తాజాగా వెబ్‌ వరల్డ్‌లోకి అడుగుపెట్టింది. డిజిటల్‌ స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్ నిర్మించిన ‘మిసెస్‌ సీరియల్‌ కిల్లర్‌’లో ప్రధాన పాత్ర పోషించింది. శిరీష్‌ కుందర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఫలితం మాట ఎలా ఉన్నా చిత్రంలో నటించిన నటీనటులపై ప్రశంసల వర్షం కురుస్తోంది. 

ఈ సినిమాలో జాక్వలిన్‌ ఫెర్నాండేజ్‌, మనోజ్ బాజ్‌పేయి, మోహిత్‌ రైనాలు కీలక పాత్రలు పోషించారు. తన భర్తను కాపాడుకోవడానికి పోరాటం చేసే ఓ భార్య పాత్రలో కనిపించిన జాక్వలిన్ నటనకు ఫిదా అవుతున్నారు. ఈ చిత్రంలో జాక్వలిన్‌ తన కంఫర్ట్‌ జోన్‌ నుంచి బయటకు వచ్చి నటించి మరి మెప్పించింది. గతంలో ఎప్పుడూ చూడని జాక్వలిన్‌ను ‘మిసెస్‌ సీరియల్‌ కిల్లర్‌’ లో చూశామని నెటిజన్లు కామెంట్లు చేయడం విశేషం. అంతేకాకుండా తన నటన, అభినయంతో తన కెరీర్‌లోనె బెస్ట్‌ పెర్మార్మెన్స్‌ చేసిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ప్రస్తుతం డిజిటల్‌ యుగం నడుస్తున్న విషయం తెలిసిందే. అక్షయ్‌ కుమార్‌, అభిషేక్‌ బచ్చన్‌లు సైతం ఓటీటీ ప్లాట్‌పామ్‌పై తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. తాజాగా వీరిదారిలోనే జాక్వలిన్‌ కూడా డిజిటల్‌ వరల్డ్‌లో అడుగుపెట్టి తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. 

చదవండి:
మీ త్యాగం అర్థం చేసుకోగలం: మహేశ్‌
మళ్లీ ట్రెండింగ్‌లోకి ‘మున్నా’.. 13 ఏళ్లైంది కదా!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా