Bigg Boss 7 Telugu: రతిక Vs భోలె షావళి.. అమ్మాయి ఖాతాలో మరొకరు బలి!

11 Nov, 2023 16:16 IST|Sakshi

బిగ్‌బాస్‌ తెలుగు ఏడో సీజన్‌లో మరో ఎలిమినేషన్‌కు రంగం సిద్ధమైంది. ఇప్పటికే తొమ్మిది మంది కంటెస్టెంట్లు ఎలిమినేట్‌ అవగా అందులో ఒకరైన రతిక వైల్డ్‌ కార్డ్‌తో రీఎంట్రీ ఇచ్చింది. కానీ ఈమె ఎంట్రీతో షోకు ఒరిగిందేమీ లేదు. పాత గొడవలు తవ్వుతూ కూర్చోవడంతో చిరాకొచ్చిన నాగార్జున ఆ సోదంతా ఇప్పుడెందుకు అని గతాన్ని వదిలెయ్‌మన్నాడు. సరేనంటూ బుద్ధిగా ఆయన చెప్పినట్లే నడుచుకుంది. కానీ ఆటలో మాత్రం చాలా వెనకబడిపోయింది. కనీసం తనేం చేస్తుందే తనకే తెలియనట్లుగా ప్రవర్తిస్తోంది. ఎలిమినేషన్‌కు ముందు ప్రశాంత్‌తో పులిహోర కలిపిన ఆమె ఈసారి ప్రిన్స్‌ను తనవైపుకు తిప్పుకుంది.

పాతాళానికి రతిక గ్రాఫ్‌
దీనివల్ల రతికకు ఏమైనా కలిసొస్తుందే లేదో కానీ యావర్‌ ఆట, గ్రాఫ్‌ మాత్రం దారుణంగా దెబ్బతింటోంది. ఈమె ఆడదు, ఇంకొకరిని ఆడనివ్వదంటూ జనాలు రతిక మాకొద్దు బాబోయ్‌ అని మొత్తుకుంటున్నారు. సోషల్‌ మీడియా పోలింగ్స్‌లోనూ రతిక చివరి స్థానంలో ఉంది. అంటే ఈమె ఎలిమినేట్‌ అవాలని జనాలు గట్టిగానే డిసైడ్‌ అయ్యారు. అటు ఫ్యామిలీ వీక్‌లో కూడా ఆమెకు, ఆమె తండ్రికి పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వలేదు. దీంతో రతిక ఎలిమినేట్‌ కానుందేమో, అందుకే తనను లైట్‌ తీసుకుంటున్నారని నెటిజన్లు రకరాలుగా ఊహించుకున్నారు.

(చదవండి:  'శోభన్‌ బాబుకు డబ్బులు ఇచ్చిన చంద్రమోహన్'.. ఎందుకంటే?)

టాలెంట్‌ ఉంది కానీ..
కానీ తాజాగా మరో ఆసక్తికరవార్త నెట్టింట గింగిరాలు తిరుగుతోంది. ఈ వారం భోలె షావళి ఎలిమినేట్‌ కానున్నాడట! ఇతడు కూడా పెద్దగా ఆడింది లేదు, కానీ పాటలతో ఇరగదీస్తున్నాడు. అప్పటికప్పుడు పాటలను అల్లుతూ అవలీలగా పాడేసే అతడి టాలెంట్‌కు జనాలు ఫిదా అవుతున్నారు. కానీ కొన్నిసార్లు సాగదీసి మాట్లాడటం, ఆటలో వెనుకబడటంతో తనకు కూడా తక్కువ ఓట్లే నమోదవుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ వారం భోలె షావళి ఎలిమినేట్‌ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఉల్టాపల్టా.. ఎలిమినేట్‌ అయ్యేది అతడేనా?
మరి నిజంగానే భోలెకు తక్కువ ఓట్లు పడ్డాయా? అమ్మాయిలను కాపాడుకోవడానికి భోలెను బలి చేశారా? అనేది తెలియాల్సి ఉంది. అసలే ఈ సీజన్‌ అంతా ఉల్టాపల్టా.. తక్కువ ఓట్లు వచ్చిన రతికను లోనికి పంపించారు. బాగా ఆడే సందీప్‌ను బయటకు పంపించేశారు. ఎలిమినేట్‌ కావాల్సిన శోభను హౌస్‌లో ఉంచుతున్నారు. ఇంకా ఈ సీజన్‌లో ఎన్ని జరగుతాయో చూడాలి!

చదవండి: గతంలో చంద్రమోహన్‌కు బైపాస్‌ సర్జరీ.. ఉదయం సొమ్మసిల్లి పడిపోవడంతో..
టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. చంద్రమోహన్‌ కన్నుమూత

మరిన్ని వార్తలు