స్వీట్‌ షాక్‌

18 Jul, 2020 06:32 IST|Sakshi
విష్ణు విశాల్, గుత్తా జ్వాల

తమిళ హీరో విష్ణు విశాల్‌ పుట్టినరోజు సందర్భంగా బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ గుత్తా జ్వాల స్వీట్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ఈ ఇద్దరూ కొంత కాలంగా ప్రేమలో ఉన్నారనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. శుక్రవారం (జూలై 17న) విష్ణు విశాల్‌ పుట్టినరోజు. తాను వస్తున్నట్లు ముందు చెప్పకుండా హైదరాబాద్‌ నుంచి చెన్నై వెళ్లి జ్వాల బాయ్‌ఫ్రెండ్‌కు స్వీట్‌ షాక్‌ ఇచ్చారు. ‘నా బర్త్‌డే సర్‌ప్రైజ్‌’ అని ఆమెతో దిగిన ఫొటోలను విష్ణు విశాల్‌ ట్వీట్‌ చేశారు.  మరోవైపు జ్వాల కూడా ‘హ్యాపీ బర్త్‌డే బేబీ’ అనే క్యాప్షన్‌ తో వారిద్దరూ దిగిన ఫొటోని ట్వీట్‌ చేశారు.

కాగా విశాల్‌ సోదరి సంగీత్‌ వేడుకలో తొలిసారి జ్వాలను కలిశారట విశాల్‌. అప్పుడు కుదిరిన స్నేహం ఆ తర్వాత ప్రేమగా మారిందని టాక్‌. ‘మేమిద్దరం రిలేషన్‌ షిప్‌లో ఉన్నాం’ అంటూ జ్వాల ఆ మధ్య వెల్లడించారు కూడా. అయితే విష్ణు విశాల్‌కు ఇప్పటికే పెళ్లయింది. రజినీ నటరాజ్‌తో ఏడేళ్ల వైవాహిక జీవితం తర్వాత 2018లో ఆమె నుంచి విష్ణు విశాల్‌ విడిపోయారు. బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ చేతన్‌ ఆనంద్‌ను 2005లో జ్వాల పెళ్లాడారు. కారణాలేంటో తెలియదు కానీ 2011లో వీరిద్దరూ విడిపోయారు. మరి.. విష్ణు–జ్వాల ప్రేమ.. పెళ్లి వరకూ వెళుతుందా?

మరిన్ని వార్తలు