మైకం కమ్మినంత పనైంది: కాజల్‌

18 Sep, 2019 10:04 IST|Sakshi

సాక్షి, చెన్నై : వాహ్‌ తాజ్‌.. హుజూర్‌. ఏమిటీ టీపొడి యాడ్‌ గుర్తుకొస్తుందా! అయితే ప్రస్తుతం ఈ ప్రస్తావనకు కారణం మాత్రం నటి కాజల్‌ అగర్వాల్‌. తనూ ఇదే భావనను వ్యక్తం చేసింది. ఈ అమ్మడిప్పుడు చాలా ఉల్లాసంగా గడుపుతోంది. ఉత్సాహంగా ఉరకలేస్తోంది. అంతా సక్సెస్‌ మహిమ అంటారా? కావచ్చు. ఆ మధ్య వరుసగా అపజయాలను ఎదుర్కొని నిరుత్సాహపడిన చందమామకు...ఇటీవల కోలీవుడ్‌లో జయం రవితో జత కట్టిన కోమాలి చిత్ర విజయం నూతనోత్సాహానిచ్చింది. అంతేకాదు విశ్వనటుడు కమలహాసన్‌ సరసన ఇండియన్‌-2 చిత్రంలో నటించే అవకాశం వరించడం ఆమె ఆనందానికి మరో కారణం. ఇవన్నీ పక్కన పెడితే ఈ బ్యూటీ మానసికోల్లాసానికి మరో కారణం ఉంది. అదే ప్రేమకు చిహ్నం అయిన తాజ్‌మహల్‌. కాజల్‌ అగర్వాల్‌ ఇటీవల ఆగ్రాలోని తాజ్‌మహల్‌ను సందర్శించింది. తాజ్‌మహల్‌ అందాలను చాలా దగ్గరగా చూడడంతో పరమానందభరితమైపోయిందట. 

ఈ విషయాన్ని..అక్కడ తను తీసుకున్న ఫొటోలను తన ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్‌ చేసింది. ‘తాజ్‌మహల్‌ను చూసి మైమరచిపోయాను. మైకం కమ్మినంత పని అయ్యింది. ఆ అద్భుతాన్ని తిలకించి భ్రమించిపోయాను. తాజ్‌మహాల్‌ వశీకరణ అందాల గురించి ఇది వరకే విన్నాను. ఇప్పుడు ఆ కట్టడాలను, లోపలి విషయాలు, సమాధి, దాని చరిత్ర నన్ను గతంలోకి తీసుకెళ్లాయి. ఇది నా జీవతంలో మరచిపోలేని అనుభవం’ అని కాజల్‌ పేర్కొంది. కాగా ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇక సినిమాల విషయానికొస్తే.. ఈ అమ్మడు నటించిన.. ‘ప్యారిస్‌ ప్యారిస్‌’ (బాలీవుడ్‌ క్వీన్‌ రీమేక్‌)సినిమా నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఇది హిందీ చిత్రం క్వీన్‌కు రీమేక్‌ అన్నది తెలిసిన సంగతే. కాగా ప్రస్తుతం కమలహాసన్‌తో ఇండియన్‌-2లో రొమాన్స్‌ చేస్తున్న కాజల్‌కు మరోసారి సూర్యతో జతకట్టే అవకాశం రాబోతున్నట్లు తాజా సమాచారం. ఇప్పటికే ఈ అమ్మడు సూర్యతో ‘మాట్రాన్‌’ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. 

#popsandme

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసండౌన్ లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నా అభిమానుల జోలికి రావద్దు: స్టార్‌ హీరో

ది బిగ్‌ బుల్‌

గొప్ప  అవకాశం  లభించింది : అశ్వినీదత్‌

మనో విరాగి

తెలుగు  సినిమాకి దక్కిన గౌరవం : విష్ణు

జీవితం తలకిందులైంది!

ముప్పైఏడేళ్లు వెనక్కి వెళ్లాను

ప్రపంచ ప్రఖ్యాత ప్రేమికుడు

పూజకు  వేళాయె!

నా జీవితంలో ఇదే అతి పెద్ద బిరుదు

విక్రమ్‌ కనిపించిందా?

బిగ్‌బాస్‌ : నామినేషన్‌లో ఉంది వీరే 

రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో కమల్‌, శంకర్‌

‘ప్రపంచంలోని అన్ని ఆనందాలకు అర్హుడివి’

మరోసారి ‘పైసా వసూల్‌’ చేస్తారా!

విక్రమ్‌ కనిపించిందా!?

బిగ్‌బాస్‌.. హిమజ కావాలనే చేసిందా?

తను హీరోగానే.. నేను మాత్రం తల్లిగా..

మోదీ బయోపిక్‌ కోసం ప్రభాస్‌

కౌశల్‌ ఇంకా అదే భ్రమలో ఉన్నాడా?

రాహుల్‌ కోసం పునర్నవి అంత పని చేస్తుందా..?

‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’గా విజయ్‌ దేవరకొండ

పోలీసుల అదుపులో ‘ఉయ్యాలవాడ’ వంశీకులు

కార్తీక్‌ సుబ్బరాజ్‌ నిర్మాణంలో ఐశ్వర్యా రాజేష్‌

విష్ణు విశాల్‌ సినిమాలో ప్రియా

నా జీవితం తలకిందులైంది : తాప్సీ

మహేష్‌ను కాదని బాలీవుడ్‌ హీరోతో!

నో ఎలిమినేషన్ ఓన్లీ రీఎంట్రీ!

‘అదెంత పొరపాటో తెలుసుకున్నా’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మైకం కమ్మినంత పనైంది: కాజల్‌

నా అభిమానుల జోలికి రావద్దు: స్టార్‌ హీరో

ది బిగ్‌ బుల్‌

నా జీవితంలో ఇదే అతి పెద్ద బిరుదు

ముప్పైఏడేళ్లు వెనక్కి వెళ్లాను

తెలుగు  సినిమాకి దక్కిన గౌరవం : విష్ణు