ప్రియాంకకు వార్నింగ్‌ ఇచ్చిన కరీనా

7 Mar, 2019 14:53 IST|Sakshi

బాలీవుడ్‌ హీరోయిన్స్‌ కరీనా కపూర్‌, ప్రియాంక చోప్రాకు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే  ప్రస్తుతం ప్రియాంక హాలీవుడ్‌ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నారు. బాలీవుడ్‌లో ప్రియాంక నటించిన చివరి చిత్రం ‘జై గంగాజల్‌’. ఆ తరువాత హాలీవుడ్‌ బాట పట్టిన ప్రియాంక అక్కడ కూడా సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్నారు. ప్రియాంక గత ఏడాది డిసెంబర్‌లో హాలీవుడ్‌ సింగర్‌ నిక్‌ జోనాస్‌ను వివాహం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో కరణ్‌ జోహార్‌ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న ‘కాఫీ విత్‌ కరణ్‌’ కార్యక్రమానికి ప్రియాంక చోప్రా, కరీనా కపూర్‌ జంటగా వచ్చారు. (ఒక్కటి కాదు.. నాలుగు బొమ్మలు!)

కార్యక్రమంలో భాగంగా కరణ్‌ ప్రియాంకను ఉద్దేశిస్తూ.. వరుణ్‌ ధావన్‌ గర్ల్‌ఫ్రెండ్‌ పేరు చెప్పమని అడిగారు. అందుకు ప్రియాంక తెలీదని చెప్పారు. పక్కనే ఉన్న కరీనా కపూర్‌.. ‘అయితే నీకిప్పుడు కేవలం హాలీవుడ్‌ యాక్టర్ల పేర్లు మాత్రమే తెలుస్తాయా.. నీ సమాధానం వింటే అలానే అనిపిస్తుంది. మూలాలను మర్చిపోవద్దు’ అంటూ వార్నింగ్‌ ఇచ్చారు. కాకపోతే అది సీరియస్‌గా కాదు జోక్‌గా. ఇక సినిమాల విషయానికొస్తే ప్రియాంక ప్రస్తుతం ‘ద స్కై ఈజ్‌ పింక్‌’ చిత్రంలో నటిస్తుండగా.. కరీనా అక్షయ్‌ కుమార్‌ సరసన ‘గుడ్‌ న్యూస్‌’ చిత్రంలో నటిస్తున్నారు.

మరిన్ని వార్తలు