లక్కీ హ్యాండ్‌

11 Mar, 2019 01:06 IST|Sakshi

అనసూయ ప్రధాన పాత్రలో రాజేష్‌ నాదెండ్ల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘కథనం’. అవసరాల శ్రీనివాస్, రణధీర్, ధన్‌రాజ్, ‘వెన్నెల’ కిషోర్, ‘పెళ్లి’ పృథ్వీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ది మంత్ర ఎంటర్‌టైన్మెంట్స్, ది గాయత్రి ఫిల్మ్స్‌ పతాకాలపై బట్టేపాటి నరేంద్ర రెడ్డి, శర్మ చుక్కా నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ని హీరో రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన కొణిదెల విడుదల చేశారు.

రాజేష్‌ నాదెండ్ల మాట్లాడుతూ– ‘‘క్షణం, రంగస్థలం’ తర్వాత అనసూయగారు ‘కథనం’ సినిమాతో హ్యాట్రిక్‌ సాధించబోతున్నారు. ఒక పాట మినహా చిత్రీకరణ పూర్తయింది. నరేంద్రరెడ్డిగారు పంపిణీదారునిగా ఏ సినిమా చేసినా హిట్‌. ఆయనది లక్కీ హ్యాండ్‌’’ అన్నారు. ‘‘అనసూయగారి కెరీర్‌లో ఇదొక బ్లాక్‌ బస్టర్‌ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు నరేంద్ర రెడ్డి. ఈ చిత్రానికి సంగీతం: సునీల్‌ కశ్యప్, కెమెరా: సతీష్‌ ముత్యాల, లైన్‌ ప్రొడ్యుసర్‌: ఎమ్‌. విజయ చౌదరి. 

>
మరిన్ని వార్తలు