యాక్షన్‌కి రెడీ

10 Feb, 2020 03:02 IST|Sakshi
కత్రినాకైఫ్‌

హీరోయిన్‌ కత్రినాకైఫ్‌ ఈ ఏడాది సూపర్‌హీరోగా మారబోతున్నారని బాలీవుడ్‌ సమాచారం. ఆల్రెడీ ఇందుకు తగ్గ పనులు కూడా మొదలయ్యాయట. సల్మాన్‌ఖాన్‌తో ‘సుల్తాన్‌’ (2016), ‘టైగర్‌ జిందా హై’(2017), ‘భారత్‌’ (2019) చిత్రాలను తెరకెక్కించిన అలీ అబ్బాస్‌ జాఫర్, కత్రినాను సూపర్‌ హీరోగా మార్చే కథను రెడీ చేస్తున్నారట. ఇందులో క్యారెక్టర్‌ పరంగా కత్రినా అదిరిపోయే యాక్షన్‌ సీక్వెన్స్‌ను చేయబోతున్నారని బాలీవుడ్‌ టాక్‌. ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌లో బిజీగా ఉన్నారు అలీ అబ్బాస్‌. వీలైనంత త్వరగా కథను ముగించి, ఈ ఏడాదిలోనే సెట్స్‌పైకి తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నారట దర్శకుడు. కాగా అలీ అబ్బాస్‌ దర్శకుడిగా తెరకెక్కించిన తొలిచిత్రం ‘మేరే బ్రదర్‌కీ దుల్హన్‌’లో హీరోయిన్‌గా నటించిన కత్రినా ఆ తర్వాత ‘టైగర్‌ జిందా హై’, ‘భారత్‌’ చిత్రాల్లోనూ కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు