ఇళయారాజాకు మరో అరుదైన పురస్కారం

27 Dec, 2019 12:01 IST|Sakshi

సాక్షి, చెన్నై: ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజాకు మరో అరుదైన గౌరవ దక్కింది. కేరళ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘హరివరాసనం’ పురస్కారాన్ని ఆయనకు ప్రకటించింది. వచ్చే నెల 15వ తేదీన శబరిమలైలో ఇళయరాజాకు పురస్కారాన్ని ప్రదానం చేయనుంది.

దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాలకు సంగీతం అందించి.. ఎన్నో అద్భుతమైన పాటలు అందించి మ్యూజిక్‌ మేస్ట్రోగా పేరొందిన ఇళయరాజా.. ఇప్పటికే ఎన్నో పురస్కారాలు, సత్కారాలు పొందారు. భారత ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక పద్మవిభూషణ్‌ పురస్కారాన్ని అందుకున్నారు. అయితే, శబరిమల కొండపై నెలకొన్న అయ్యప్పను మేలుకొలిపే ‘హరివరాసనం’ పాటను ఎంతో భక్తితన్వయత్వంపై ఇళయరాజా పాడటం.. విశేషమైన ప్రాచుర్యం పొందింది. అయ్యప్ప భక్తులు నిత్యం వినే పాటగా ఇది ప్రశంసలు అందుకుంది. ఈ నేపథ్యంలో ఇళయరాజకు హరివరాసనం పురస్కారం దక్కడం, శబరిమలలో దానిని అందుకోబోవడం అరుదైన విశేషమని చెప్పాలి.

మరిన్ని వార్తలు