దసరాకు రాకీ భాయ్‌ వస్తున్నాడు

14 Mar, 2020 01:26 IST|Sakshi
యష్‌

రెండేళ్ల క్రితం వెండితెరపై రాకీ భాయ్‌ సత్తా ఏంటో బాక్సాఫీస్‌కు తెలిసింది. ఇప్పుడు రాకీ భాయ్‌ మళ్లీ వస్తున్నాడు. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో యష్‌  హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘కేజీఎఫ్‌: చాప్టర్‌ 2’. 2018లో వచ్చిన ‘కేజీఎఫ్‌: చాప్టర్‌1’ చిత్రానికి ఇది సీక్వెల్‌. ఇందులో శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తున్నారు. కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిలిమ్స్‌ పతాకంపై విజయ్‌ కిరగందూర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాత సాయి కొర్రపాటి ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు.

ఇందులో రాకీ పాత్రలో నటించారు యష్‌. ‘కేజీఎఫ్‌: చాప్టర్‌ 2’ చిత్రాన్ని ఈ ఏడాది అక్టోబర్‌ 23న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. ‘‘అధీర పాత్రలో నటిస్తున్న సంజయ్‌ దత్, రవీనాటాండన్, యశ్‌లపై చిత్రీకరించిన సన్నివేశాలతో ఈ సినిమా మేజర్‌ షెడ్యూల్‌ పూర్తయింది’’ అని చిత్రబృందం వెల్లడించింది. ఈ సినిమాకు రవి బస్రూర్‌ సంగీతం అందిస్తున్నారు. భువన్‌ గౌడ కెమెరామేన్‌. తమిళ, కన్నడ, తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో విడుదలైన ‘కేజీఎఫ్‌’  ఫస్ట్‌ పార్ట్‌కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభించింది. దీంతో సీక్వెల్‌ పై భారీ అంచనాలు ఉన్నాయి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు