కోటికొక్కడు

9 Mar, 2018 05:09 IST|Sakshi

కన్నడ స్టార్, ‘ఈగ’ ఫేమ్‌ సుదీప్, నిత్యామీనన్‌ జంటగా కేయస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో కన్నడ, తమిళ్‌ భాషల్లో రూపొందిన చిత్రం ‘కోటిగొబ్బ–2’. ఈ సినిమాను దుహర మూవీస్‌ పతాకంపై నిర్మాత కల్యాణ్‌ ధూళిపాళ్ల ‘కోటికొక్కడు’ అనే టైటిల్‌తో తెలుగులో రిలీజ్‌ చేస్తున్నారు. ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో కల్యాణ్‌ మాట్లాడుతూ– ‘‘డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో రీసెంట్‌గా ‘రచయిత’ సినిమాను నిర్మించాను. మంచి అభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చిపెట్టింది. రెండోది మాస్‌ కమర్షియల్‌ మూవీ  చేయాలనుకుంటున్న టైమ్‌లో ‘కోటిగొబ్బ–2’ చుశాను. నాకు బాగా నచ్చింది.

తమిళ్, కన్నడ భాషల్లో ఆల్మోస్ట్‌ 120కోట్లకుపైగా కలెక్ట్‌ చేసింది. తెలుగులో కూడా కచ్చితంగా పెద్ద హిట్‌ అవుతుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘సుదీప్‌ చేసిన బెస్ట్‌ మూవీస్‌లో ‘కోటికొక్కడు’ పెద్ద హిట్‌ సాధించింది. ‘రచయిత’ చిత్రంతో మంచి నిర్మాతగా కల్యాణ్‌ పేరు తెచ్చుకున్నాడు. అతను రిలీజ్‌ చేస్తున్న ఈ సినిమా కూడా హిట్‌ సాధించాలి’’ అన్నారు దర్శకుడు సముద్ర. ‘‘కల్యాణ్‌ మంచి అభిరుచి ఉన్న నిర్మాత మాత్రమే కాదు ప్యాషన్‌ ఉన్న నిర్మాత కూడా. కేయస్‌ రవికుమార్‌ పెద్ద హీరోలతో సినిమాలు చేశారు. సుదీప్‌ యాక్టింగ్‌ సూపర్‌. ఈ సినిమా విజయం సాధించాలి’’ అన్నారు ఎస్వీఆర్‌ మీడియా శోభారాణి. ప్రకాశ్‌రాజ్, నాజర్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: డి. ఇమ్మాన్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా