టచ్ ఫోన్ కోసం...

23 Jun, 2014 00:57 IST|Sakshi
టచ్ ఫోన్ కోసం...

ఓ ఐడియా జీవితాన్ని మార్చేస్తుందంటారు. కానీ అతని జీవితాన్ని ఓ టచ్ ఫోన్ మార్చి పారేసింది. టచ్ ఫోన్ కొనేందుకు సిద్ధమైన అతని జీవితంలో ఎలాంటి పరిణామాలు సంభవించాయనే ఆసక్తికరమైన కథాంశంతో ‘కుల్ఫీ’ చిత్రం రూపొందింది. జై, కలర్స్ స్వాతి ఇందులో హీరో హీరోయిన్లు. శరవణ రాజన్ దర్శకుడు. నరసింహారెడ్డి సామల నిర్మాత. ఈ నెల 27న విడుదలకు సిద్ధమైన ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ -‘‘అన్ని వర్గాలకూ నచ్చే కథ ఇది. యువన్ శంకర్‌రాజా స్వరాలందించిన పాటలు ఇటీవలే విడుదలై శ్రోతల ఆదరణ పొందుతున్నాయి. పోర్న్ స్టార్ సన్నీ లియోన్ ఇందులో ఒక ప్రత్యేక గీతం చేశారు. వెంకట్ ప్రభు, కస్తూరి చిత్రానికి ఆయువు పట్టులాంటి పాత్రలు చేశారు’’ అని తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: కృష్ణతేజ, కెమెరా: ఎస్. వెంకటేశ్, నిర్మాణ నిర్వహణ: ఎ.ఎన్. బాలాజీ, సమర్పణ: శ్రీనివాసరెడ్డి సామల.