అమ్మమ్మ అయిన యంగ్‌ హీరోయిన్‌

11 Jul, 2018 15:30 IST|Sakshi

‘జూలి 2’తో బాలీవుడ్‌లో సెటిల్‌ అవుదామనుకున్న హీరోయిన్‌ లక్ష్మీరాయ్‌కు నిరాశే ఎదురయ్యింది. బాలీవుడ్‌ ఈ భామను పట్టించుకోక పోయినా దక్షిణాది పరిశ్రమ ఈ ముద్దుగుమ్మను ఆదరిస్తూనే ఉంది. ప్రస్తుతం ఆమె చేతిలో ఒక మలయాళ చిత్రం ‘ఓరు కుట్టనందన్‌ బ్లాగ్‌’, తమిళ చిత్రం ‘నీయ 2’ తో పాటు మరో నాలుగు సినిమాలు ఉన్నాయి. వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న లక్ష్మీరాయ్‌ తన అభిమానులకు ఒక శుభవార్త చెప్పారు. 33 ఏళ్ల ఈ హీరోయిన్‌ అమ్మమ్మ అయ్యిందంట.

లక్ష్మీరాయ్‌కి ఇంకా వివాహమే కాలేదు. మరి అలాంటిది అమ్మమ్మ అవ్వడం ఏంటి అనుకుంటున్నారా..? విషయం ఏంటంటే ఈ ‘కాంచన’ భామ రెండు కుక్కలను పెంచుకుంటుంది. వాటినే తన సొంత పిల్లల్లా భావిస్తోంది. ఈ మధ్యే ఆ రెండు కుక్కలు మరో రెండు కుక్క పిల్లలకు జన్మనిచ్చాయి. ఇదే విషయాన్ని లక్ష్మీరాయ్‌ తన ట్విటర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

‘చాలామంది నా ఈడు అమ్మాయిలు ఇపాటికే అమ్మలయ్యారు. కానీ నేను మాత్రం ఏకంగా అమ్మమ్మనే అయ్యాను. నా బిడ్డలు ‘మియు’, ‘లియు’.. ‘టిఫాని’, ‘పకో’ అనే మరో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. ఇప్పుడు నా ప్రపంచం మరింత పెద్దదయ్యింది’ అనే సందేశాన్ని ట్విటర్‌లో పోస్టు చేశారు. ప్రస్తుతం లక్ష్మీరాయ్‌ తన పిల్లల(కుక్కపిల్లల) కోసం క్లౌడ్‌నైన్‌ ఆస్పత్రిలో ఉన్నారు. తెలుగులో ‘ఖైది నం 150’ సినిమాలో ఈ భామ మెగాస్టార్‌ చిరంజీవితో కలిసి ప్రత్యేక గీతంలో మెరిసిన సంగతి తెలిసిందే.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు