మహేష్‌ సినిమాను పక్కన పెట్టిన దర్శకుడు!

20 Aug, 2019 10:23 IST|Sakshi

‘అర్జున రెడ్డి’ సినిమాతో సౌత్‌లో సెన్సేషన్‌ సృష్టించిన దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా. తొలి సినిమాతోనే జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సందీప్‌, అదే సినిమా రీమేక్‌తో బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ను షేక్‌ చేశాడు. అర్జున్‌ రెడ్డి రీమేక్‌గా తెరకెక్కిన కబీర్‌ సింగ్‌ హిందీలో దాదాపు 300 కోట్ల వసూళ్లు సాధించి ఈ ఏడాది బిగెస్ట్‌ హిట్స్‌లో ఒకటిగా నిలిచింది.

అయితే అర్జున్ రెడ్డి హిట్‌ తరువాత సందీప్‌, మహేష్‌ బాబు హీరోగా ఓ సినిమా చేయాలని భావించాడు. సందీప్‌ చెప్పిన లైన్‌కు ఓకె చెప్పిన మహేష్ పూర్తి స్క్రిప్ట్‌ను సిద్ధం చేయాలని చెప్పాడు. ఈలోగా సందీప్‌ బాలీవుడ్ ప్రాజెక్ట్‌తో బిజీ కావటంతో మహేష్ మూవీ పనులు ఆగిపోయాయి. హిందీలో సూపర్‌ హిట్ రావటంతో సందీప్‌కు బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థల నుంచి ఆఫర్లు వస్తున్నాయి.

దీంతో మహేష్ మూవీని సందీప్‌ పక్కన పెట్టేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. మహేష్ కూడా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో సందీప్‌ రెడ్డి వంగా, మహేష్ బాబు కాంబినేషన్‌లో మూవీ పట్టాలెక్కేందుకు చాలా సమయం పట్టే అవకాశం ఉంది. మహేష్ ప్రస్తుతం అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు