Sudheer Babu: 'మామయ్య.. ఆగిపోలేదు మీ ప్రస్థానం'.. సుధీర్ బాబు ఎమోషనల్ పోస్ట్!

15 Nov, 2023 15:44 IST|Sakshi

ఇటీవలే మామ మశ్చీంద్ర సినిమాతో ప్రేక్షకులను అలరించిన యంగ్ హీరో సుధీర్ బాబు. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అభిమానులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఇవాళ సూపర్ స్టార్ కృష్ణ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఎమోషనలయ్యారు. మామయ్యను తలుచుకుంటూ సోషల్ మీడియాలో వేదికగా సూపర్ కృష్ణ ఫోటోను పంచుకున్నారు. 

సుధీర్ బాబు తన ట్వీట్‌లో రాస్తూ 'మామయ్య , మీకు మాకు ఉన్న దూరం ఎంత? కలవరిస్తే కలలోకి వచ్చేంత, తలచుకుంటే మా గుండెల్లో బ్రతికేంత. ఆగిపోలేదు మీ ప్రస్థానం, ఆరిపోలేదు మా అభిమానం. మరువను నేను, మరువదు నేల. మీ కీర్తి, మీ స్పూర్తి ... అమరం .... అద్భుతం.' అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. 

కాగా.. ప్రస్తుతం  హరోం హర అనే పాన్ ఇండియా చిత్రంలో సుధీర్ బాబు నటిస్తున్నారు. దీపావళి సందర్భంగా  ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈనెల 22న టీజర్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఈ సినిమాను సెహరి ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. సుధీర్‌ బాబు కెరీర్‌లోనే అత్య‌ధిక బ‌డ్జెట్‌తో రూపొందిస్తున్నారు. 

ఇదిలా ఉండగా.. మరోవైపు మహేశ్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ కూడా కృష్ణ మొదటి వర్ధంతి సందర్భంగా మరిన్ని సేవ కార్యక్రమాలు మొదలుపెట్టనున్నారు. ఇప్పటికే ఎం.బీ ఫౌండేషన్‌ పేరుతో ఎంతోమంది చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్లకు సాయం చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ ఫౌండేషన్‌ ద్వారా చిన్నారుల చదువు కోసం ఉపకారవేతనాలు కూడా ఇవ్వనున్నారు.

మరిన్ని వార్తలు