హ్యాట్రిక్ హిట్ కోసం ‘ఆచారి అమెరికా యాత్ర’

7 Jan, 2018 12:24 IST|Sakshi

మంచు విష్ణు హీరోగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన మరో కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఆచారి అమెరికా యాత్ర. బ్రహ్మానందం కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా అలరించనుంది. సింగం 3 ఫేం అనూప్ సింగ్ థాకూర్ ప్రతినాయక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను పద్మజ పిక్చర్స్ బ్యానర్ పై కీర్తీ చౌదరి, కిట్టులు నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్‌ను స్టార్ట్ చేశారు చిత్రయూనిట్. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్స్‌తో ఆకట్టుకున్న ఆచారి అమెరికా యాత్ర యూనిట్, తాజాగా ఆసక్తికరమైన టీజర్ ను రిలీజ్ చేశారు. కామెడీ, రొమాన్స్, యాక్షన్ లతో రూపొందించిన ఈ సినిమా మంచు విష్ణు, జి.నాగేశ్వర్రెడ్డిలకు హ్యాట్రిక్ సక్సెస్ అందిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్.

>
మరిన్ని వార్తలు