ఆ డైరెక్టర్‌ నన్ను మోసం చేశాడు

29 Dec, 2017 15:23 IST|Sakshi

సాక్షి, సినిమా : సుమంత్‌ అశ్విన్‌ డెబ్యూ మూవీ తూనీగ తూనీగతో తెలుగులో నటించింది మనీషా యాదవ్‌. అయితే ఆ తర్వాతే ఆమె వరుసగా తమిళ చిత్రాలతో బిజీ అయిపోయింది. కానీ, కెరీర్‌ పీక్స్‌ లో ఉండగానే వివాహం చేసుకుని.. ఈమధ్యే సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించారు. కానీ, ప్రస్తుతం ఆమెకు పెద్దగా అవకాశాలు రావటం లేదు. అందుకు దర్శకుడు వెంకట్‌ ప్రభు కారణమని ఆమె ఆరోపిస్తోంది. 

విషయం ఏంటంటే.. చెన్నై 600028(తెలుగులో కొడితే కొట్టాలిరా) చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన చెన్నై 600028-2 లో మనీషా యాదవ్‌ ‘సొప్పన సుందరి’ అనే ఓ పాత్రలో మెరిసింది. అంతేకాదు ఐటెం సాంగ్‌తో కూడా చిందులేసింది. అయితే అది మరీ దారుణంగా ఉండటంతో ఆమెపై విమర్శలు వచ్చాయి. ఆమె చేసిన పాత్రను(డబుల్‌ మీనింగ్‌ డైలాగులకు) ప్రేక్షకులు చీదరించుకున్నారు. దీంతో మొత్తానికి ఆమె కెరీర్‌ మసకబారిపోయిందంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. 

అది ఐటెం సాంగ్‌ కాదని.. సినిమాకు ఎంతో కీలకంగా మారుతుందని దర్శకుడు వెంకట్‌ ప్రభు నాతో చెప్పాడు. కానీ, నా పాత్రను చాలా దారుణంగా చిత్రీకరించారు. నేను ఆయనపై ఎంతో నమ్మకం పెట్టుకున్నా. కానీ, ఆయన వమ్ము చేశారు. ఇకపై కొత్త చిత్రాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటా అని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. కాగా, సరోజా, గోవా, గాంబ్లర్‌, రాక్షసుడు చిత్రాలతో వెంకట్‌ ప్రభు తెలుగువారికి కూడా సుపరిచితుడే.

>
మరిన్ని వార్తలు