‘ఏ’ ఫస్ట్‌ లుక్‌.. మైండ్‌ బ్లాక్‌

9 May, 2020 14:40 IST|Sakshi

నితిన్‌ ప్రసన్న, ‘ప్రెజర్‌ కుక్కర్‌’ ఫేం  ప్రీతీ అశ్రాని ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సస్పెన్స్‌ మెడికల్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘ఏ’. అవంతిక ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో ఫిల్మ్ మేకింగ్ కోర్సు చేసిన యుగంధర్ ముని ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన టైటిల్‌ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. తాజాగా ‘ఏ’ చిత్ర టైటిల్‌ పోస్టర్‌ను చిత్ర బృందం కాసేపటి క్రితం విడుదల చేసింది. 

చిత్ర టైటిల్‌ పోస్టర్‌లో హీరో మూడు డిఫరెంట్‌ గెటప్స్‌లో కనిపిస్తున్నాడు. తొలి చిత్రంలోనే మూడు విభిన్న పాత్రల్లో నటిస్తున్న హీరో నితిన్‌ ప్రసన్న దీన్ని ఒక ఛాలెంజ్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘ఇక పాత్రల మధ్య చాలా వ్యత్యాసం ఉందని, బడ్జెట్‌ పరిమిత దాటకుండా, వీఎఫ్‌ఎక్స్‌ ఎక్కువ వాడకుండా పాత కెమెరా ట్రిక్‌లను వాడి సన్నివేశాలను చిత్రీకరించాం’ అని చిత్రబృందం పేర్కొంది. 

ఫస్ట్‌లుక్‌ విడుదల సందర్భంగా దర్శకుడు యుగందర్‌ మాట్లాడుతూ..‘ఈ సన్నివేశాల చిత్రీకరణకు ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు గారిని ఆదర్శంగా తీసుకున్నాం. కంటెంట్ పరంగా తెలుగు సినిమా స్థాయిని మా  చిత్రం మరింత పెంచేలా ఉంటుందని గర్వంగా చెప్పగలను’అని అన్నారు. జబర్దస్త్‌ బేబీ దీవెన, రంగాథం, కృష్ణవేణి, భరద్వాజ్‌ తదితరులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో నటించారు. 

మరిన్ని వార్తలు