ఇంట్లోనే ఉందాం

22 Mar, 2020 06:13 IST|Sakshi

కోవిడ్‌ 19 (కరోనా వైరస్‌)ను అధిగమించడానికి ప్రధాని మోదీ నేడు (ఆదివారం) జనతా కర్ఫ్యూ (ఉదయం ఏడుగంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఇంటిలోపలే ఉండటం)కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. పౌరులందరూ ఈ జనతా కర్ఫ్యూలో పాల్గొని కరోనా వైరస్‌ను అధిగమించాలని కొందరు స్టార్స్‌ కూడా సోషల్‌ మీడియాలో ఈ విధంగా ట్వీట్స్‌ చేశారు.

ఇటలీ ప్రస్తుతం దారుణ పరిస్థితులను ఎదుర్కొంటోంది. కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా అక్కడ మరణాల సంఖ్య మెండుగా ఉంది. అలాంటి పరిస్థితులు మన దేశంలో తలెత్తకూడదు. ప్రధాని మోదీ పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూలో పాల్గొందాం. స్వీయ గృహనిర్భందం, సామాజిక దూరం పాటిద్దాం.  

– రజనీకాంత్‌
 
ప్రధాని పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూకు కట్టుబడి ఉందాం. ఈ అసాధారణమైన పరిస్థితుల్లో అసాధారణ రీతిలో జాగ్రత్తులు తీసుకుందాం  

– కమల్‌ హాసన్‌

మోదీగారు పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూలో భాగస్వాములం అవుదాం. కరోనా విపత్కర పరిస్థితులను కట్టడి చేసేందుకు సామాజిక దూరాన్ని పాటిద్దాం  

– నాగార్జున
 
ఈ ఆదివారం మార్చి 22 ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు జనతా కర్ఫ్యూను పాటిద్దాం  

– వెంకటేశ్‌
 

జనతా కర్ఫ్యూకు అందరం సపోర్ట్‌ చేద్దాం. కరోనా వైరస్‌పై సమిష్టిగా పోరాడదాం  

– మహేశ్‌బాబు
 
కరోనా వైరస్‌పై పోరాడటానికి స్వీయ గృహనిర్భందం, సామాజిక దూరం.. ఈ రెండూ బలమైన ఆయుధాలు. కరోనాని జయించాలంటే అందరం మన వంతు కృషి చేయాలి. జనతా కర్ఫ్యూని విజయవంతం చేసి మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.

– ఎన్టీఆర్‌

జనతా కర్ఫ్యూలో భాగంగా పౌరులందరూ ఇళ్లలోనే ఉండాలని కోరుకుంటున్నాను. సమిష్టిగా పోరాడి కరోనాను అధిగమిద్దాం  

– రాజమౌళి

మన ఇంట్లోకి ఎవరైనా వస్తే చెంబుతో నీళ్లిచ్చి, కాళ్లు కడుక్కున్నాకే ఇంట్లోకి రమ్మంటాం, అలాంటి సంప్రదాయం మనది. అలాంటిది ఈ మహమ్మారి కరోనా వస్తానంటే రానిస్తామా? అందుకే మన దేశం కోసం, మనందరి ఆరోగ్యం కోసం మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీగారు చెప్పిన జనతా కర్ఫ్యూని పాటిద్దాం. ఈ రోజు ఉదయం 7గంటల నుండి రాత్రి 9 గంటల వరకు మన ఇళ్లల్లో మనమే ఉంటూ బయటివారిని ఎవరినీ రానివ్వకుండా వీలైనంత పరిశుభ్రతను పాటించడం ఈ రోజు ముఖ్యోద్దేశ్యం. అలా ఇంట్లో ఉండి మన వంటలను మనమే చేసుకుని మనమే తింటూ ఇంట్లో ఉందాం. మనందరం ఒకటే అని నిరూపించటం కోసం సాయంకాలం 5 గంటలకు మన ఆనంద హర్హాతిరేకానికి గుర్తుగా మన దేశ పౌరులందరూ ఒక్కటే అనుకుని చేతులన్నీ శుభ్రం చేసుకొని ఒక్కసారి చప్పట్లు కొడదాం. అలా చేసి, మనందరం ఒకటే అని నిరూపిద్దాం. జైహింద్‌.

– రాజేంద్రప్రసాద్‌ 

మరిన్ని వార్తలు