అవిసీ హఠాన్మరణం.. అనుమానాలు!

21 Apr, 2018 12:00 IST|Sakshi
డీజే అవిసీ (పాత చిత్రం)

స్టాక్‌ హోమ్‌: ప్రముఖ సంగీత దర్శకుడు, డీజే.. అవిసీ హఠాన్మరణం పాప్‌ రంగాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. 28 ఏళ్లకే ఈ యువ సంచలనం మృతి చెందటం అనుమానాలకు తావిస్తోంది. ఆయన మృతి వార్తను పబ్లిసిస్ట్‌ బరోన్‌ మీడియాకు వెల్లడించారు. ఒమన్‌లో అవిసీ కన్నుమూసినట్లు శుక్రవారం బరోన్‌ పేరు మీద ఓ ప్రకటన విడుదలయ్యింది. 

అవిసీ ఎవరు?..  స్వీడన్‌కు చెందిన డీజే అవిసి. అసలు పేరు టిమ్ బర్గిలింగ్. చిన్న వయసులోనే పాప్‌ రంగంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. వేక్ మీ అప్ సాంగ్‌ అతని కెరీర్‌ను మలుపు తిప్పగా.. లెవల్స్ , అండ్ రీసెంట్లీ, లోన్లీ టుగెదర్ ఆల్బమ్‌లతో అవిసి పేరు ప్రపంచమంతా మారుమోగిపోయింది. రెండుసార్లు అతని పేరు గ్రామీ అవార్డులకు నామినేట్‌ అయ్యింది కూడా. పాక్‌-అమెరికన్‌ సింగర్‌ నదిలా అలీతోపాటు పలువురు ప్రముఖ సింగర్‌లతో రాపర్‌గా కూడా ఆల్బమ్‌లను సృష్టించాడు. నిర్మాతగా కూడా అవిసీ రాణించాడు.

మృతిపై అనుమానాలు... అవిసీ మృతికి గల కారణాలు తెలియరాలేదు. అయితే 2013లో అతనికి ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. నికోటిన్‌కు బానిసై అతను రోగాల బారిన పడ్డాడని పుకార్లు వినిపించాయి. అయితే అదంతా నిజం కాదని ఆ సమయంలో అవిసీ ఖండించాడు. కానీ, 2014లో అతను చాలా మట్టుకు షోలను అర్థంతరంగ రద్దు చేసుకోవటంతో మళ్లీ అనుమానాలు మొదలయ్యాయి. చివరకు ఓ గార్డియన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అవిసీ తాను అనారోగ్యంతో బాధపడుతున్నట్లు పరోక్షంగా తెలిపాడు. అవిసీ ఎలా చనిపోయాడన్నదానిపై అధికారులు ప్రకటన చేసే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు