కథే హీరో.. ‘అ!’ అదే టైటిల్..!

4 Jan, 2018 17:23 IST|Sakshi

వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో నాని తొలిసారిగా నిర్మాతగా మారి తెరకెక్కిస్తున్న సినిమా ‘అ!’. నిత్యామీనన్, కాజల్, రెజీనా, ఈషా, అవసరాల శ్రీనివాస్, ప్రియదర్శి కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో రెండు కీలక పాత్రలకు నాని, రవితేజలు డబ్బింగ్ చెపుతున్నారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను చిత్రయూనిట్ వినూత్నంగా నిర్వహిస్తున్నారు.

ఇప్పటికే ఒక్కో పోస్టర్ తో ఒక్కో పాత్రను పరిచయం చేస్తూ వచ్చిన నాని, తాజాగా ఆసక్తికరమైన టీజర్ ను రిలీజ్ చేశాడు. డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాతో ప్రశాంత్ వర్మ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నాని స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమా మార్క్ కె రోబిన్ సంగీతమందిస్తున్నాడు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా