భార్యకు నవాజుద్దీన్‌ లీగల్‌ నోటీసులు

27 Jun, 2020 13:43 IST|Sakshi

ముంబై: బాలీవుడ్‌ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ తన భార్య అలియాకు లీగల్‌ నోటీసులు పంపించినట్లు అతడి తరపు న్యాయవాది అద్నాన్‌​ షేక్‌ తెలిపారు. అలియా తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ పరువు నష్టం కలిగిస్తుందని నవాజుద్దీన్‌ నోటీసులో పేర్కొన్నట్లు ఆయన చెప్పారు. మే 6న అలియా విడాకులు కోరుతూ నవాజుద్దీన్‌కు తన న్యాయవాది ద్వారా నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. ఈ నోటీసులో మెయింటెనెన్స్‌‌ కింద నెల నెల డబ్బులు చెల్లించాలని ఆమె డిమాండ్‌ చేశారు. అయితే దీనిపై నవాజుద్దీన్‌ ఇంతవరకు స్పందించలేదని, అతడు డబ్బులు పంపించకపోవడం వల్ల పిల్లల స్కూలు ఫీజులు చెల్లించలేకపోతున్నాని ఆమె  మీడియా ఎదుట వాపోయారు. (‘త్వరలోనే చాలా విషయాలు తెలుస్తాయి’)

దీనిపై నవాజుద్దీన్‌ న్యాయవాది అద్నాన్‌ షేక్‌ మాట్లాడుతూ.. ‘తన నోటిసుకు నవాజుద్దీని సకాలంలోనే స్పందించాడు. తను నోటీసులో పేర్కొన్నట్లుగానే నెలవారి భత్యం చెల్లిస్తున్నాడు. చెల్లింపుకు సంబంధించిన వివరాలు, స్క్రీన్‌షాట్‌లు కూడా ఉన్నాయి. పిల్లలకు సంబంధించిన ఖర్చులన్నింటినీ  లాక్‌డౌన్‌కు ముందే అలియాకు చెల్లించాడు’ అని చెప్పుకొచ్చాడు. అయిన నవాజుద్దీన్‌కు అతడి కుటుంబానికి పరువు నష్టం కలిగించేందుకు ఉద్దేశపూర్వకంగా అలియా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. అందుచేతనే నవాజుద్దీన్‌, అలియాకు లీగల్‌ నోటీసులు పంపించాడని తెలిపారు. (పొలం పనుల్లో బిజీ అయిన స్టార్‌ నటుడు)

ఇక నుంచి తనపై ఎలాంటి తప్పుడు ఆరోపణలు చేయొద్దని,  ఇటీవల చేసిన వ్యాఖ్యలకు వ్రాతపూర్వక వివరణ ఇవ్వాలని నవాజుద్దీన్‌ నోటీసులో పేర్కొన్నట్లు అద్నాన్‌ చెప్పారు. నవాజుద్దీన్‌, అలియాల విడాకుల విచారణపై ఆయన స్పందిస్తూ.. అలియా పంపించిన విడాకుల నోటిసుపై ఇప్పటికే మేము స్పందించామన్నాడు. ఇప్పుడు తమ నోటీసులకు అలియా సమాధానం ఇవ్వాలన్నారు. అలియా, నవాజుద్దీన్ ఆయన కుటుంబానికి పరువు నష్టం కలిగేలా ప్రచారం చేస్తున్నారని, ఇక మీదట అలాంటి ఆరోపణలు చేస్తే తనపై చట్టబద్దమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. (రూ.30 కోట్లు అడగలేదు: నటుడి భార్య)

మరిన్ని వార్తలు