మురుగదాస్‌పై నయనతార ఫైర్‌

6 Nov, 2019 11:12 IST|Sakshi

సినిమా: జీవితంలో తాను చేసిన అతి పెద్ద తప్పు అదే అని సంచలన వ్యాఖ్యలు చేసింది నటి నయనతార. ఆమె చేసిన కామెంట్‌ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతూ కలకలం సృష్టిస్తోంది. ఇంతకీ ఈ అమ్మడు ఏమనందనేగా మీ ఆసక్తి. ఈలేడీ సూపర్‌ స్టార్‌ నట జీవితమే కాదు, వ్యక్తిగత జీవితం సంచలనమే. ఎందుకంటే అన్ని సంఘటనలు తన జీవితంలో జరిగాయి. తన చిత్రాల ప్రమోషన్‌ కార్యక్రమాలకు కూడా ఆమె దూరంగా ఉంటుంది. అలాంటిది ఈ మధ్య ఒక ఆంగ్ల పత్రికకు భేటీ ఇచ్చింది. అది సంచలనంగా మారింది.

తాజాగా ఒక ఎఫ్‌ఎం రేడియోకు ఇచ్చిన ఇంటర్వ్యూ ఇంకా ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇందులో తన ప్రేమ వ్యవహారంతో సహా పలు విషయాల గురించి మాట్లాడింది. ముఖ్యంగా ప్రముఖ దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌పై ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ప్రస్తుతం ఈ సంచలన నటి ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌కు జంటగా దర్బార్‌ చిత్రంలో నటించింది. 11 ఏళ్ల క్రితం ఆయన దర్శకత్వంలో గజిని చిత్రంలో నటించింది. ఆ చిత్రంలో దర్శకుడు తనకు చెప్పిన కథాపాత్ర వేరని, చిత్రంలో చూపించింది వేరని, తనను ఆ చిత్రంలో డమ్మీని చేశారని ఆరోపణలు చేసింది. తాను జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు గజని చిత్రంలో నటించడం అని సంచలన వ్యాఖ్యలు చేసింది. గజిని తర్వాత నయనతార ఇప్పటివరకు మురుగదాస్‌ దర్శకత్వంలో నటించలేదు. మళ్లీ ఇప్పుడు రజనీకాంత్‌కు జంటగా దర్బార్‌ చిత్రంలో నటించింది. 

మురుగదాస్‌పై మళ్లీ ఆగ్రహించడానికి కారణం దర్బార్‌ చిత్ర పారితోషికమే కారణం అని సమాచారం. ఈ చిత్రంలో నటించినందుకు నయనతారకు పారితోషికం బాకీ ఉందట. దీంతో ఒక రోజు షూటింగ్‌కు కూడా రాకపోవడంతో హీరో రజనీకాంత్‌ కూడా ఎదురుచూడాల్సి వచ్చిందట. దర్శకుడు మురుగదాస్‌ కల్పించుకుని సమాధాన పరిచి నయనతారను నటింపజేసినట్లు టాక్‌. పారితోషికం చెల్లిస్తేనే నటిస్తానన్న వార్తలు తను ఇమేజ్‌ను డామేజ్‌ చేస్తాయని నయనతార భావించినట్లుంది. ఈ కారణంగానే నయనతార తన ఇంటర్వ్యూలో మురుగదాస్‌పై ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది. దర్బార్‌ చిత్రంలోనూ నయనతార పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో గజనీ చిత్రంతోనే మోసపోయాననుకుంటే మళ్లీ అదే మోసమా అన్న ఆగ్రహంతోనే తాజాగా నయనతార మరోసారి మురుగదాస్‌పై ఆగ్రహిం‍చినట్టు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. దీని గురించి దర్శకుడు మురుగదాస్‌ ఎలా స్పందిస్తారో, దర్బార్‌ చిత్ర వర్గాల రియాక్షన్‌ ఎలా ఉండబోతోందో చూడాలి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అలా చేయొద్దని తాత చెప్పారు: హీరో

విజయ్‌సేతుపతి ఇంటి ముట్టడి

రాజా వస్తున్నాడహో...

ట్రైలర్‌ బాగుంది

డిటెక్టివ్‌ రిటర్న్స్‌

ఫోన్‌ విరగ్గొట్టేస్తానన్నాను!

నాతో నువ్వుంటే చాలు

మన కోసం ఉండేది మనమే!

ప్యారిస్‌లో సామజవరగమన

ట్రామ్‌లో ప్రేమ

‘జార్జ్ రెడ్డి’ పోస్టర్‌ రిలీజ్‌

నా భర్తను నేనే చంపేశాను.!

వాళ్లకిష్టమైతే పెళ్లి చేస్తాం: రాహుల్‌ పేరెంట్స్‌

బిగ్‌బాస్‌ ఫలితంపై స్పందించిన కత్తి మహేశ్‌

బిగ్‌బాస్‌: శ్రీముఖి కొంపముంచిన ‘టాటూ’

రాహుల్ గెలుపును తప్పుబట్టిన శ్రీముఖి

అనుకూలం కాబట్టే రజనీకి అవార్డు

నేను నటిస్తున్నానంటే..

కబ్జా చేస్తా

చరిత్రను మార్చిన యుద్ధం

హాకీ ఎక్స్‌ప్రెస్‌

సాంగ్‌తో షురూ

గంగూభాయ్‌ ప్రియుడు

సత్తా చూపిస్తా

బిగ్‌బాస్‌: అతను శ్రీముఖిని ఓడించడం నచ్చింది

సైంటిఫిక్‌ బొంబాట్‌

ఈ ఉగాదికి హింసే!

హార్ట్‌ బీట్‌ని ఆపగలరు!

పేరుతో సినిమా

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అలా చేయొద్దని తాత చెప్పారు: హీరో

మురుగదాస్‌ పై నయనతార సంచలన వ్యాఖ్యలు

విజయ్‌సేతుపతి ఇంటి ముట్టడి

ప్యారిస్‌లో సామజవరగమన

ట్రామ్‌లో ప్రేమ

రాజా వస్తున్నాడహో...