రెండు రోజుల్లో 8 సార్లు ‘లగాన్‌’ చూశా

16 Oct, 2017 02:24 IST|Sakshi

‘‘నెక్ట్స్‌ నువ్వే’ నా 60వ సినిమా. ‘పైసా’ సినిమా నాకు పర్‌ఫెక్ట్‌ బ్రేక్‌ ఇస్తే, ‘పటాస్‌’ కమర్షియల్‌ హిట్‌ ఇచ్చింది. నేను కమర్షియల్‌ మ్యూజిక్‌ పక్కాగా చేస్తానని ‘రాజా ది గ్రేట్‌’ నిరూపిస్తుంది. దాని తర్వాతి స్థానంలో ‘నెక్ట్స్‌ నువ్వే’ నిలుస్తుంది’’ అని సంగీత దర్శకుడు సాయికార్తీక్‌ అన్నారు. ఆది, వైభవీ శాండిల్య, రష్మీ గౌతమ్, బ్రహ్మాజీ ప్రధాన పాత్రల్లో రూపొందిన సినిమా ‘నెక్ట్స్‌ నువ్వే’. యాంకర్, నటుడు ప్రభాకర్‌ దర్శకత్వంలో వి4 క్రియేషన్స్‌పై ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ సినిమా నవంబర్‌ 3న విడుదలవుతోంది.

సాయికార్తీక్‌ మాట్లాడుతూ– ‘‘చిన్నప్పుడు సినిమాకి వెళ్లినప్పుడు పాటల గురించి కాకుండా నేపథ్య సంగీతం ఎలా ఉందని చూసేవాణ్ణి. ఆర్‌ఆర్‌ మీద నాకెంత ఆసక్తి అంటే ‘లగాన్‌’ చిత్రాన్ని రెండు రోజుల్లో 8 సార్లు కంటిన్యూస్‌గా చూశా. మొదటి నుంచీ ప్రభాకర్‌గారు అన్ని శాఖల్లో ఉండటంతో కొత్త డైరెక్టర్‌ అనే ఫీలింగ్‌ ఎక్కడా రాలేదు. కథని బట్టే సంగీతం వస్తుంది. ఒక్కో సంగీత దర్శకుడికి ఒక్కో ఐడెంటిటీ ఉంటుంది’’ అన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు