వెంకటలక్ష్మి అదృశ్యం

28 Feb, 2020 00:13 IST|Sakshi
చెందు ముద్దు, బ్రహ్మాజీ, ఆనంద్‌ ప్రసాద్, నిత్యా శెట్టి, విశ్వాంత్, సంజయ్‌

విశ్వాంత్‌ దుద్దుంపూడి, నిత్యాశెట్టి, నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్‌రావు ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ఓ పిట్ట కథ’. ‘ఇట్స్‌ ఎ లాంగ్‌ స్టోరీ’ అన్నది ఉపశీర్షిక. చెందు ముద్దు దర్శకత్వం వహించారు. భవ్య క్రియేషన్స్‌ పతాకంపై వి. ఆనంద్‌ ప్రసాద్‌ నిర్మించిన ఈ సినిమా మార్చి 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో చెందు ముద్దు మాట్లాడుతూ– ‘‘ముక్కోణపు ప్రేమకథగా రూపొందిన చిత్రమిది.. వినోదం కూడా ఉంటుంది. వెంకటలక్ష్మి అనే యువతి అదృశ్యం అవుతుంది.. దానికి కారణాలేంటి? అనేది ప్రేక్షకులకు థ్రిల్‌ని పంచుతుంది.

సెన్సార్‌ నుంచి క్లీన్‌ ‘యు’ సర్టిఫికెట్‌ వచ్చింది’’ అన్నారు. ‘‘ఇప్పటివరకూ తెలుగు తెరపై రాని కథతో నిర్మించిన చిత్రమిది. తర్వాత ఏం జరుగుతుంది? అనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో ఉంటుంది’’ అన్నారు నటుడు బ్రహ్మాజీ. ‘‘నా కెరీర్‌ని మంచి మలుపు తిప్పే చిత్రం ‘ఓ పిట్టకథ’’ అన్నారు నిత్యాశెట్టి. ‘‘అందరం స్నేహితుల్లా కలసిపోయి ఈ సినిమా చేశాం’’ అన్నారు సంజయ్‌రావు. ‘‘ఈ సినిమా నన్ను మరో మెట్టు పైకి ఎక్కిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు విశ్వాంత్‌. ‘‘అన్ని వర్గాల ప్రేక్షకులకు మా సినిమా నచ్చుతుంది’’ అన్నారు ఆనంద్‌ ప్రసాద్‌.

మరిన్ని వార్తలు