హిట్‌ కాంబినేషన్‌ రిపీట్‌ 

1 Apr, 2020 05:13 IST|Sakshi

తమిళంలో హీరో విజయ్‌– హీరోయిన్‌ కాజల్‌ ది సూపర్‌ హిట్‌ కాంబినేషన్‌. ఈ ఇద్దరూ  గతంలో ‘తుపాకీ’, ‘జిల్లా’, ‘మెర్సల్‌’ సినిమాల్లో కలసి నటించారు. తాజాగా ఈ సూపర్‌ హిట్‌ కాంబినేషన్‌ మరో సినిమాలో నటించబోతున్నారని సమాచారం. ప్రస్తుతం విజయ్‌ – మురుగదాస్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనుంది. 2012లో వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘తుపాకీ’కి ఇది సీక్వెల్‌ అని సమాచారం. ‘తుపాకీ’లో నటించిన కాజల్‌నే కథానాయికగా తీసుకుంటే బాగుంటుందని మురుగదాస్‌ భావించారట. సన్‌ నెట్‌వర్క్‌ నిర్మించనున్న ఈ సినిమా విజయ్‌ కెరీర్లో 65వ సినిమా.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా